E-Paper
Advertisement

Varun Tej: మెగా వారింట పెళ్లి సందడి.. ఇటలీ లో గ్రాండ్ గా వరుణ్-లావణ్య వివాహం

Varun Tej: మెగా వారింట పెళ్లి సందడి.. ఇటలీ లో గ్రాండ్ గా వరుణ్-లావణ్య వివాహం
Advertisement

Varun Tej : మెగా వారి కాంపౌండ్ లో పెళ్లి సందడి మొదలైంది. ఇటలీ వేదికగా జరగనున్న మెగా వారి పెళ్లి కోసం కుటుంబం మొత్తం ఇప్పటికే ఇటలీ చేరింది. వరుణ్ లావణ్య త్రిపాఠి నవంబర్ 1న పెళ్లి బంధంతో ముడిపడనున్నారు. ఆరు సంవత్సరాలుగా ఎంతో సీక్రెట్ గా ప్రేమాయణం నడిపిన ఈ జంట ఇటీవల కుటుంబ సభ్యుల సమ్మతితో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.

నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి అటు మెగా ఫ్యామిలీ ఇటు అల్లు ఫ్యామిలీ కాబోయే కొత్త జంటకు ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఇస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు వీరి పెళ్లి సందడి ఇటలీ వరకు చేరింది. ఇటలీలో జరగనున్న కొణిదెల వారి వివాహానికి సంబంధించిన షెడ్యూల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటలీలోని టుస్కానీ నగరంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరగనుంది.

Advertisement

అదేదో సినిమాలో ఐదు రోజుల పెళ్లి చేసినట్టుగా ప్రస్తుతం వీరిద్దరికి నాలుగు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నట్లు సమాచారం. ఇంతకీ ఈ నాలుగు రోజుల్లో ఏ ఫంక్షన్స్ జరగబోతున్నాయో ఓ లుక్ వేద్దాం పదండి.. పెళ్లికి శుభ సూచనగా అక్టోబర్ 31న పెళ్లి వేడుకలను హల్దీ ఫంక్షన్ తో మొదలు పెడతారు. ఇక అదే రోజు సాయంత్రం వధూవరులకు మెహందీ వేడుక నిర్వహించడం జరుగుతుంది.

నవంబర్ 1న ఇటలీలోనే వరుణ్ , లావణ్య త్రిపాఠి వేదమంత్రాల సాక్షిగా పెళ్లి పీటలు ఎక్కుతారు. ఇక దీంతో ఇటలీలో హడావిడి మొత్తం ముగిసిపోతుంది. మెగా ఫ్యామిలీ అంటే కేవలం సినిమానే కాదు కదా.. ఇటు రాజకీయం అటు వ్యాపారం రెండు రకాలుగా బాగా పలుకుబడి ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ అందరి కోసం హైదరాబాదులో తిరిగి గ్రాండ్ గా వేడుక జరుపుతారు. అదే నవంబర్ ఐదున జరిగే రిసెప్షన్.

Advertisement

ఈ రిసెప్షన్ కి సినీ ప్రముఖులు ,రాజకీయ ప్రముఖులు మెగా అభిమానులతో పాటు వ్యాపారవేత్తలు కూడా హాజరు అవుతారు. పెళ్లి తర్వాత లావణ్య తన సినీ కెరీర్ కు బ్రేక్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలోకి రాబోయే ఈ కొత్త కోడలు పెళ్లికూతురుగా ఎంత అందంగా కనిపిస్తుందో చూడాలని మెగా అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×