E-Paper
Advertisement

Revanth Reddy speech: ‘మేడిగడ్డ మీద నుంచి కర్ణాటకకు పోదాం రా’.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్!

Revanth Reddy | ఓటమి భయంతో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై పచ్చి అబద్దాలు చెప్తున్నారని ముఖ్యమంత్రిపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. రెండో విడత బస్సుయాత్రలో భాగంగా సంగారెడ్డి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు

Revanth Reddy speech: ‘మేడిగడ్డ మీద నుంచి కర్ణాటకకు పోదాం రా’.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్!
Advertisement
Revanth Reddy latest news

Revanth Reddy latest news(Political news today telangana):

ఓటమి భయంతో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై పచ్చి అబద్దాలు చెప్తున్నారని ముఖ్యమంత్రిపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. రెండో విడత బస్సుయాత్రలో భాగంగా సంగారెడ్డి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. లేని మాటల్ని అన్నట్టు ఒక ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు రేవంత్‌రెడ్డి.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని టీపిసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ.. కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన అయిదు గ్యారంటీలను అమలు చేయడం లేదని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

ఈ అంశంపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇచ్చిన హామీలు అమలవుతున్నాయో లేదో కర్ణాటకకు వెళ్లి చూద్దాం రమ్మని ఆయన కేసీఆర్ ఛాలెంజ్ చేశారు.
”కర్ణాటకకు తీసుకెళ్లడానికి బస్సు సిద్ధంగా ఉంది. ప్రగతి భవన్ రావాలా… ఫామ్ హౌజ్ రావాలా కేసీఆర్.. చెప్పు.. ఇదే మీకు మా సవాల్. పోతూ పోతూ మేడిగడ్డ మీదుగా పొయ్యి.. నువ్వు కట్టిన నాణ్యతలేని ప్రాజెక్ట్ చూసుకుంటా పోదాం. పనిమంతుడు పందిరి వేస్తె కుక్క తోక తాకి కూలిందంట. కేసీఆర్ కట్టిన మేడిగడ్డ పరిస్థితి మేడిపండులా ఉంది. వీళ్లను కొరడాతో కొట్టాలి. జైలో వేసి చిప్ప కూడు తినిపించాలి” అని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

మాట నిలబెట్టుకునే చరిత్ర కాంగ్రెస్ పార్టీది
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసినా.. సోనియా గాంధీ ఇచ్చిన మాట కోసం తెలంగాణ ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో జీతాలు, పెన్షన్లు ఎప్పుడూ పడతాయో తెలియని పరిస్థితి ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అందుకే సోనియా మరోసారి పూనుకొని తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేస్తున్న హామీలను చూపిస్తాం.. రమ్మని డీకే శివ కుమార్ సవాల్ విసిరితే… కేటీఆర్ తోక ముడిచారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisement

అలాగే రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, రైతు భరోసా పథకం కింద ఎకరాకు ప్రతి సంవత్సరం రూ.15,000, ఉపాధి హామి పథకం కింద ప్రతి కూలీకి ప్రతి సంవత్సరం రూ.12000 కాంగ్రెస్ ప్రభుత్వ ఇస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో రాబోయే ఎన్నికలలో గెలిచి డిసెంబర్ 9న, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.

తెలంగాణ ఎన్నికలో కాంగ్రెస్ గెలుపుతో ఏర్పడబోయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే నాయకుడు జగ్గారెడ్డిని గెలిపించడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఖర్గే ఇక్కడకు వచ్చారని అన్నారు. జగ్గన్నను 50 వేల భారీ మెజారిటీతో గెలిపించాలని, రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ : మల్లికార్జున ఖర్గే
ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, పావలా వడ్డీ రుణాలు, సాగు నీళ్లు… ఇలా ఏ హామీనీ సీఎం కేసీఆర్ నేరవేర్చలేదని సభలో పాల్గొన్న కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతులు చనిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×