BigTV English

Flying Car: తొలి ఫ్లయింగ్ టాక్సీ.. చైనా ఆమోదం..

Flying Car: తొలి ఫ్లయింగ్ టాక్సీ.. చైనా ఆమోదం..

Flying Car: ఫ్లయింగ్ టాక్సీల రంగంలో కీలక ముందడుగు పడింది. అటానమస్ ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ లాండింగ్(eVTOL) టాక్సీలకు చైనా ఆమోదం తెలిపింది. ఏవియేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణం కానున్న ఫ్లయింగ్ టాక్సీలను అనుమతించిన తొలి దేశం చైనాయే.


గాంగ్జౌ‌కు చెందిన ఇహాంగ్ సంస్థ రూపొందించిన ట్విన్ సీటర్ పూర్తి అటానమస్ డ్రోన్‌ EH216-S AAV చైనా ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ పొందింది. ఇది ఇద్దరు ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చగలదు. ఇహాంగ్ రూపొందించిన ఈ టాక్సీ 16 చిన్న రోటార్ల సాయంతో గాల్లో నిట్టనిలువుగా పైకి లేస్తుంది. విశ్రాంతి సమయంలో ఈ డ్రోన్ రోటార్లు ముడుచుకుుని ఉంటాయి. అంటే కొద్ది పాటి స్థలంలోనే దీనిని పార్క్ చేసే వీలుంటుందన్న మాట.

రెండు నెలల్లోగా ఫ్లయింగ్ టాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. హెఫే నగరంలో ఈ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్థానిక ప్రభుత్వం ఇహాంగ్‌తో 100 మిలియన్ డాలర్ల ఒప్పందం కూడా చేసుకుంది. వంద టాక్సీలకు ఆర్డర్ చేసినట్టు తెలుస్తోంది. టూరిస్టులను చేరవేయడంతో పాటు డెలివరీ, అత్యవసర సేవల కోసం ఇహాంగ్ టాక్సీలను వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు.


సాధారణ క్యాబ్‌లకు అయ్యే వ్యయానికి సమానంగా భవిష్యత్తులో ఫ్లయింగ్ టాక్సీల్లో రోజు సమీపంలోనే ఉందని ఇహాంగ్ భావిస్తోంది. ఫ్లయింగ్ టాక్సీల పరిశోధన, అభివృద్ధి‌పై పలు దేశాలు కన్నేశాయి. భవిష్యత్తు రవాణా సాధనంగా మారనున్న ఫ్లయింగ్ టాక్సీలకు బోలెడంత డిమాండ్ ఉందని మెకిన్సే అంచనా వేసింది. దాదాపు 30 బిలియన్ డాలర్లు విలువ చేసే ఆర్డర్లు సిద్ధంగా ఉండొచ్చని పేర్కొంది.

ఫ్లయింగ్ టాక్సీలను అనుమతించిన తొలి దేశంగా చైనా.. ఈ మార్కెట్‌ను చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 40వేల విడతల్లో టెస్టింగ్ పూర్తయిన తర్వాతే చైనా పౌర విమానయాన శాఖ ఇహాంగ్ సంస్థకు అనుమతులు ఇచ్చింది. 18 సిటీలకు వలంటీర్ ప్రయాణికులను చేరవేయడం ద్వారా ఈ టాక్సీ పనితీరును పరిశీలించారు. రోటార్ల సామర్థ్యం, ఈ టాక్సీలకు కావాల్సిన వైర్‌లెస్ నెట్‌వర్క్ ను ప్రభుత్వం క్షుణ్ణంగా పరీక్షించింది.

తమ ఫ్లయింగ్ ట్యాక్సీలను పైలట్లు లేకుండానే నడపొచ్చని ఇహాంగ్ తెలిపింది. భాగంగా 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల వీటీ-30 ఫ్లయింగ్ టాక్సీ రెండో వెర్షన్‌ను సైతం ఇహాంగ్ అభివృద్ధి చేస్తోంది. ఈవీటీఓఎల్ తయారీ కంపెనీల్లో ఇహాంగ్‌కు ప్రస్తుతం వోలోకాప్టర్(జర్మనీ), జోబీ ఏవియేషన్, ఆర్చర్ ఏవియేషన్(కాలిఫోర్నియా) గట్టి పోటీదారులుగా ఉన్నాయి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×