E-Paper
Advertisement

Rana Naidu Season 2: చివరి దశకు ‘రానా నాయుడు 2’ షూటింగ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Rana Naidu Season 2: చివరి దశకు ‘రానా నాయుడు 2’ షూటింగ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Rana Naidu Season 2 update(Film news in telugu today): టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ఈ పేరుకు యూత్‌ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌‌లో మంచి క్రేజ్ ఉంది. కామెడీ, ఎమోషనల్ నటనతో వెంకటేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వెంకటేష్ సినిమా అంటే భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు, కడుపుబ్బా నవ్వించే సీన్లు ఉంటాయని అందరూ భావించే వారు. కానీ ఇప్పుడంతా మారిపోయింది. ఇప్పుడు వచ్చే సినిమాలలో మసాలా లేనిదే హిట్ అయ్యే ఛాన్స్‌లు చాలా తక్కువ. అందువల్లనే వెంకీ మామ కూడా అదే బాట పట్టాడు.

గతేడాది మార్చిలో ‘రానా నాయుడు’ అనే ఒక బోల్డ్ వెబ్‌ సిరీస్‌లో నటించాడు. ఇదే వెంకటేష్ మొదటి సిరీస్. బోల్డ్ అండ్ యాక్షన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్‌లో వెంకటేష్‌తో పాటు యంగ్ హీరో రానా కూడా నటించాడు. వీరిద్దరూ కలిసి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ రిలీజ్ అయింది. యూత్‌కు బాగా కనెక్ట్ అయింది కూడా. కానీ ఇది వెంకటేష్ మొదటి సిరీస్ కావడం.. అదీగాక ఇందులో బోల్డ్ సన్నివేశాలు ఉండటంతో అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ ఆశ్చర్యపోయారు.

Advertisement

ఇంతవరకు బోల్డ్ కంటెంట్ జోనర్‌లోకి వెళ్లని వెంకటేష్.. ఇప్పుడు అలాంటి సిరీస్‌తో రావడం చూసి షాక్ అయిపోయారు. దీంతో ఆ మధ్య ఈ సిరీస్ తీవ్ర దుమారం రేపింది. ఇలాంటి కంటెంట్ ఉన్న సిరీస్‌లను ఎందుకు స్ట్రీమింగ్ చేయ్యనిస్తున్నారని చాలామంది మండిపడ్డారు. అయినా ఈ సిరీస్‌కు ఎలాంటి డ్యామేజ్ కాలేదు. ఇంకొంచెం బాగా పాపులర్ అయింది. దీంతో ఇండియా వైడ్‌గా ఎక్కువ మంది చూసిన వెబ్‌సిరీస్‌లలో ఒకటిగా ఈ సిరీస్ నిలిచింది.

Also Read: ‘రానా నాయుడు 2’లో పవర్‌ఫుల్ విలన్.. ఆ పాత్రలో దుమ్ము దులిపేస్తాడంట!

Advertisement

ఈ సిరీస్‌తో అటు వెంకటేష్, ఇటు రానా పేర్లు మారుమోగిపోయాయి. ఇక ఈ రానా నాయుడు సిరీస్‌కి యూత్‌ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సీక్వెల్‌ను ప్రకటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ సీజన్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వెంకటేష్ అండ్ రానా ఈ సీజన్ 2 షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ముంబైలో వీరిద్దరిపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ షూటింగ్ కోసమే వెంకీ, రానా కొన్నాళ్ల నుంచి ముంబైలో ఉంటున్నట్లు సమాచారం. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల అంటే జూలైలో ఈ సిరీస్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి.. సెప్టెంబర్‌లో రానా నాయుడు సీజన్ 2 సిరీస్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో ఈ సిరీస్‌ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ సీజన్ 2కి కరణ్ అన్షుమాన్, సూపర్న్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×