E-Paper
Advertisement

#SVC58: లుంగీ గెటప్ తో విక్టరీ వెంకటేష్.. సంక్రాంతి సినిమా మొదలైంది

#SVC58: లుంగీ గెటప్ తో విక్టరీ వెంకటేష్.. సంక్రాంతి సినిమా మొదలైంది
Advertisement

Venkatesh and Anil Ravipudi Combo: విక్టరీ వెంకటేష్.. సినిమా అంటే రెండున్నర గంటలు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని అందరూ అనేమాట. మరి అలాంటి వెంకటేష్ సడన్ గా లుంగీ గెటప్ తో దిల్ రాజు కొత్త సినిమా సెట్ లోకి ఎంటరయ్యారు. దీంతో నిర్మాతలు మేకింగ్ వీడియో ఒకటి విడుదల చేశారు.

విక్టరీ వెంకటేష్ జాయిన్ అయ్యాడని చెబుతూ హడావుడి చేశారు. అయితే ఆయన షూటింగు స్పాట్ లో లుంగీ కట్టి, బ్లూషర్ట్ వేసి హడావుడి చేస్తుంటే కట్ టు కట్ షాట్స్ తీసి నెట్టింట మేకింగ్ వీడియో వదిలారు. ఇప్పుడది వైరల్ గా మారిపోయింది. ఎందుకింత హడావుడి అంటే.. దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్ చాలా సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాకి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే..

Advertisement

ఈ సినిమాకి డైరక్టర్ మరెవరో కాదు.. ఎఫ్ 2, ఎఫ్ 3 తీసిన అనిల్ రావిపూడి. అందుకే ఇంత హైప్ వచ్చేసింది. మళ్లీ వీరి ముగ్గురి కలయికలో ఎన్ని నవ్వులతో నిండిన సినిమా వస్తుందోనని అభిమానులు ఎక్సైట్ అవుతున్నారు. అంతేకాదు ఎఫ్ 2 తరహాలోనే ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని షూటింగును శరవేగంగా తీస్తున్నారు.

Also Read: దంచుడే దంచుడు.. ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ గూస్‌బంప్సే

Advertisement

అంటే సినిమా షూటింగు ప్రారంభమై చాలా రోజులైంది. ఇందులో వెంకటేష్ పాత్ర ఎంటర్ కావడంతో ఆయన సెట్ లోకి వచ్చి సందడి సందడి చేశారు. అయితే సినిమా పేరు కూడా..‘సంక్రాంతికి వస్తున్నాం’అని అనుకుంటున్నారు. మరి ఇందులో హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు ఎంపికయ్యారు.

సినిమా కథ విషయానికి వస్తే ఒక భార్య-భర్త- మధ్యలో ప్రేయసి ఈ కాన్సెప్ట్ తో వస్తోందని అంటున్నారు. ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ వెంకటేష్ కి కొట్టిన పిండి. ఇంక అనిల్ రావిపూడి మార్క్ కామెడితో కాన్సెప్ట్ కరెక్ట్ గా కుదిరి కనెక్ట్ అయితే.. ఈసారి సంక్రాంతి బ్లాక్ బస్టర్.. వెంకటేష్ సినిమాయేనని ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే ఇది దిల్ రాజు సమర్పణలో వస్తున్న 58వ సినిమా. ఇందులో కూడా రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×