Saripodhaa Sanivaaram Trailer: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కొత్త కొత్త దర్శకులతో సినిమాలు తీసి మంచి హిట్లు కొడుతున్నాడు. గతేడాది కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ‘దసర’ మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన హీరోల జాబితాలోకి చేరిపోయాడు. ఆ తర్వాత మరో కొత్త దర్శకుడు శౌర్యువ్‌తో ‘హాయ్ నాన్న’ మూవీ తెరకెక్కించి మరో సూపర్ హిట్ అందుకున్నాడు. తండ్రీ కూతుళ్ల బంధంతో తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఈ రెండు చిత్రాలకు ఇటీవల ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. అంతేకాకుండా దసర మూవీ నుంచి నాని ది బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాల సక్సెస్‌తో నాని ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ‘సరిపోదా శనివారం’ మూవీ ఒకటి. ఇంతక ముందు తనకు ‘అంటే సుందరానికి’ సినిమాతో ఫ్లాప్ అందించిన దర్శకుడు వివేక్ ఆత్రేయకు నాని మరో ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ‘సరిపోదా శనివారం’ మూవీ తెరకెక్కుతోంది.
Also Read : ‘సరిపోదా శనివారం’ పవర్ ప్యాక్డ్ మేకింగ్ వీడియో.. అదిరిపోయిందిగా
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్లు, సాంగ్స్ అందరిలోనూ భారీ అంచనాలు పెంచాయి. ఇందులో నాని రెండు వేరియేషన్స్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకటి క్లాసిక్‌గా మరొకటి మాస్‌గా కనిపించబోతున్నట్లు ఇదివరకు రిలీజ్ అయిన టీజర్లు చూస్తే అర్థం అవుతుంది. కాగా ఇందులో నాని మాస్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుస్ అవుతున్నారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా మరో అప్డేట్ అందించారు.
‘సరిపోదా శనివారం’ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో నాని లుక్, యాక్షన్ డైలాగ్‌లు అదిరిపోయాయి. అలాగే హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ కూడా తన అందంతో ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌తో సినిమా రేంజ్ మరో స్థాయికి చేరింది. ముఖ్యంగా ఎస్ జే సూర్య యాక్టింగ్ దుమ్ము దులిపేశాడు. ఓవరాల్‌గా అన్ని ఎలిమెంట్స్‌తో కట్ చేసిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి.