E-Paper
Advertisement

Vidya Balan : మరొక్క ఛాన్స్… టాలీవుడ్ వైపు బాలయ్య హిందీ హీరోయిన్ చూపు

Vidya Balan : మరొక్క ఛాన్స్… టాలీవుడ్ వైపు బాలయ్య హిందీ హీరోయిన్ చూపు
Advertisement

Vidya Balan : ప్రస్తుతం టాలీవుడ్ ఇండియాలోనే నెంబర్ వన్ చిత్ర పరిశ్రమగా కొనసాగుతోంది. పాన్ ఇండియా రేసులో దూసుకెళ్తూ మన తెలుగు హీరోలు క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీ ఇన్ని కావు. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటిదాకా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని చెప్పుకున్న బడా హిందీ హీరోలు సైతం తెలుగు స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అంతేకాదు పలువురు హిందీ హీరోయిన్లు టాలీవుడ్ లో ఒక్క ఛాన్స్ అంటూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అందులో తాజాగా బాలయ్య హీరోయిన్ విద్యా బాలన్ (Vidya Balan) కూడా చేరింది.

జాతీయ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ నటి విద్యా బాలన్ (Vidya Balan) ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు.  నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన తండ్రి, లెజెండరీ నటుడు ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తీసిన రెండు భాగాల బయోపిక్‌లతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలలో బాలయ్య తల్లి పాత్రలో మెరిసింది విద్యా. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు భార్య బసవతారకం పాత్రలో విద్యా నటించింది. అయితే ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గ్రాసర్‌గా నిలిచాయి. దీంతో విద్యా మరో తెలుగు సినిమాలో నటించలేదు. ఆమెకు టాలీవుడ్ డైరెక్టర్స్ నుంచి పిలుపు కూడా రాలేదు.

Advertisement

ఎప్పటిలాగే బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ గడిపేస్తోంది విద్యా బాలన్ (Vidya Balan). తాజాగా ఆమె సహనటుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి త్వరలో తెరపైకి రానున్న హిందీ హర్రర్ కామెడీ ‘భూల్ భూలయ్యా 3’తో థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి విద్యా నిన్న హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రో కబడ్డీ లీగ్ (PKL) 11 ప్రారంభ వేడుకలో విద్యా బాలన్, కార్తీక్  ఆర్యన్ ఇద్దరూ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో విద్యా బాలన్ (Vidya Balan) మాట్లాడుతూ స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించాలనే కోరికను వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో నటించాను. సరైన స్క్రిప్ట్ దొరికితే మరిన్ని తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నాను’’ అని విద్యా అన్నారు. ఈ బ్యూటీకి టాలీవుడ్ మరోసారి రెడ్ కార్పెట్ పరుస్తుందా? ఆమె రిక్వెస్ట్ ఏ హీరో, డైరెక్టర్ దృష్టిని ఆకర్షిస్తుందో చూడాలి.

Advertisement

ఇదిలా ఉండగా “భూల్ భూలయ్య 3″లో విద్య (Vidya Balan) ఐకానిక్ మంజులిక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో మాధురీ దీక్షిత్, త్రిప్తి దిమ్రీ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనీజ్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 1 న ఈ హర్రర్ మూవీని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లు జాన్వి కపూర్, దిశా పటాని, నోరా ఫతేహి లాంటి హిందీ హీరోయిన్లు సౌత్ లో ఛాన్సులు కొట్టేస్తున్నారు. మరి విద్యా బాలన్ ను ఆ ఛాన్స్ ఎప్పుడు వరిస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×