E-Paper
Advertisement

Family Star OTT Release Date: ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Family Star OTT Release Date: ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?
Advertisement

Family Star OTT Release Date Fixed: కొన్ని సినిమాలు ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. కానీ బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంటాయి. అయితే మరికొన్ని సినిమాలు మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండా.. తమ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అనే ఒక చిన్న భయంతో వస్తారు. అయితే అలాంటి సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ స్టర్ హిట్‌గా నిలుస్తుంది.

ఈ మధ్య ఇలాంటివి చాలానే జరిగాయి. అందులో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఒకటి. ఈ మూవీ ఫస్ట్ నుంచి ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌తో ఫుల్ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ట్రైలర్‌తో మరింత బజ్‌ను అందుకుంది.

Advertisement

దీంతో ఈ మూవీ చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ అందరి అంచనాలను తలకిందులు చేసింది. మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎందుకంటే సినిమా విడుదలకు ముందు ఫుల్ హైప్ ఉంది కాబట్టి ప్రేక్షకాభిమానులు భారీ ఎక్స్‌పెర్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ వారు అనుకున్నంత స్థాయిలో సినిమా లేకపోవడంతో డీలా పడ్డారు. అందువల్లనే ఈ మూవీ మిక్స్డ్ టాక్‌ను అందుకుంది.

Also Read: ఓటీటీలోకి సిద్దు గాని ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Advertisement

అయితే రొటీన్ స్టోరీ, కథనం కూడా కొత్తగా లేకపోవడంతో యూత్ ఈ మూవీని రిజెక్ట్ చేశారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రం ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది. ఇక ఈ మూవీకి కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే థియేటర్లలో రన్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకు దక్కించుకుంది. దీంతో థియేటర్ రన్ అనంతరం ఈ చిత్రాన్ని మే 3న స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసి సినీ ప్రియులు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×