CSK Won the Match Against MI in IPL 2024: ఐపీఎల్ లో ఆదివారం నాడు రెండు సమ ఉజ్జీలైన జట్లతో మ్యాచ్ జరగింది. అయితే ఇక్కడ చెప్పుకోదగిన గొప్ప విషయం ఏమిటంటే ధోనీ కెప్టెన్సీ ముందు.. హార్దిక్ కెప్టెన్సీ తేలిపోయింది. ముఖ్యంగా తను తీసుకున్న నిర్ణయాలు ముంబయి కొంప ముంచాయి.
విషయానికి వస్తే ముంబై వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో ధోనీ హ్యాట్రిక్ సిక్సర్లతో 206 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేసినా సరే ముంబై ఇండియన్స్ 20 పరుగుల దూరంలో ఆగి, పరాజయం పాలైంది. చాలా ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో చెన్నై బ్యాటింగ్ కి వచ్చింది. ఓపెనర్లు ఆజ్యింక రహానే (5), రచిన్ రవీంద్ర (21) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. ఫస్ట్ డౌన్ వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. తనకి సపోర్టుగా శివమ్ దుబె ఇరగ దీశాడు. తను కూడా 38 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. నాటౌట్ గా ఉన్నాడు.
Also Read: చెలరేగిన సాల్ట్.. కోల్‌కతా ఘనవిజయం..
ఇంక చివరి ఓవర్ లో వచ్చిన ధనాధన్ ధోనీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు. అప్పటికి చెన్నయ్ స్కోరు 186 ఉన్నదాన్ని 20 పరుగులు చేసి 206కి తీసుకువెళ్లాడు.
ముంబై బౌలింగులో హార్దిక్ 2, గెరాల్డ్ కొయెట్జీ , శ్రేయాస్ గోపాల్ చెరొక వికెట్ తీశారు.
విచిత్రం ఏమిటంటే లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తూ సరిగ్గా 186 పరుగుల వద్ద ఆగిపోయంది. ఇప్పుడు నెట్టింట పెద్ద గోలగా మారింది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఆఖరి ఓవర్ వేయకుండా ఉంటే బాగుండేదని అంటున్నారు. ఒకవైపు నుంచి బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తా ఉంటే, తనని వదిలేసి హార్దిక్ చేయడం సరికాదని అంటున్నారు.
అంతేకాదు మహ్మద్ నబీ అప్పటికి 3 ఓవర్లు వేసి వికెట్లు తీయకపోయినా కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తనకైనా ఇవ్వాల్సిందని అంటున్నారు. తగుదునమ్మా అంటూ వేశాడు. 20 పరుగులిచ్చాడు. ఇప్పుడవే సరిగ్గా తక్కువయ్యాయని అంటున్నారు.
Also Read: Travis Head Makes History In IPL: ట్రావిస్ హెడ్.. విధ్వంసం 39 బంతుల్లో సెంచరీ.. రికార్డు బ్రేక్
ఇకపోతే ముంబై నుంచి రోహిత్ శర్మ 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇషాన్ కిషన్ (23), తిలక్ వర్మ (31), హర్దిక్ పాండ్యా (2), టిమ్ డేవిడ్ (13), రొమారియో (1) చేశారు. అయితే గత మ్యాచ్ లో విధ్వంసం చేసిన సూర్యకుమార్ ఈసారి మ్యాచ్ లో డక్ అవుట్ అయ్యాడు. ఇదంతా ధోనీ ప్లానింగ్ అని అంటున్నారు. సూర్య బలహీనతలను కనిపెట్టి, తనని త్వరగా అవుట్ చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్ ఓటమికి కెప్టెన్సీ లోపాలు స్పష్టంగా కనిపిస్తే, చెన్నై గెలుపునకు ధోనీ వ్యూహాలు వర్కవుట్ అయ్యాయని అంటున్నారు. అందుకనే రోహిత్ శర్మ సెంచరీ చేసినా సరే, తనకి సరిగ్గా సపోర్ట్ ఇచ్చేవారు కరవయ్యారు. తన ఒంటరిపోరాటం ఫలితాన్నివ్వలేదు.
చెన్నై బౌలింగులో మథీషా పతిరన 4, తుషార్ దేశ్ పాండే, ముస్తాఫిజర్ రహ్మాన్ ఒకొక్క వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ గెలుపుతో చెన్నై మూడో స్థానంలో నిలిచింది. ముంబై ఏడు నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయింది.