E-Paper
Advertisement

Tillu Square in OTT: ఓటీటీలోకి సిద్దు గాని ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Tillu Square in OTT: ఓటీటీలోకి సిద్దు గాని ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Advertisement

Tillu Square in OTT: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. మార్చి 29న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫస్ట్ పార్ట్ ‘డీజే టిల్లు’ మంచి హిట్ కావడంతో సీక్వెల్‌పై మొదట్నుంచే అంచనాలు ఉన్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇంతటి భారీ కలెక్షన్లను రాబడుతుందని ఎవరూ ఊహించిఉండరు కూడా. ఈ మూవీలో డీజే టిల్లు బ్యూటీ నేహాశెట్టి (రాధిక) కూడా క్యామియో రోల్‌ పోషించి మెప్పించింది.

Advertisement

ముఖ్యంగా ఈ మూవీలో రొమాంటిక్ సీన్లు యూత్‌ని థియేటర్లకు పరుగులు పెట్టించాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అనుపమ సినీ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఏ సినిమాలోనూ తన రొమాంటిక్ యాంగిల్‌ని ప్రదర్శింలేదు. కానీ ‘టిల్లు స్క్వేర్’ మూవీకి వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నంగా పూర్తింగా రెచ్చిపోయింది.

సిద్దు జొన్నలగడ్డ (టిల్లు)గానితో ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లతో కుర్రకారు మతిని పోగొట్టేసింది. సినిమాలో ప్రతి సీన్‌లో అను బ్యూటీ తన అందంతో మంత్రముగ్దులను చేసింది. మరోవైపు సిద్దు కామెడీ డైలాగ్ డెలివరీతో దుమ్ముదులిపేశాడు. సినిమా భారాన్ని మొత్తం తన బుజాలపై వేసుకుని బ్లాక్ బస్టర్ వైపుగా నడిపించాడు.

Advertisement

Also Read: ఈ సినిమా చూస్తే ఫ్రీగా మలేషియా, కాశ్మీర్, ఊటీ ఫ్యామిలీ ట్రిప్.. ఆఫర్ అదిరింది

అలాగే రామ్ మిర్యాల అందించిన సాంగ్స్ మరో లెవెల్ అనే చెప్పాలి. మొత్తంగా వీరందరి కలయికతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పటికీ థియేటర్లలో కొనసాగుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ వార్త బయటకొచ్చి నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. దీంతో మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలాఖరులో స్ట్రీమింగ్ కానుందని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు మరో వార్త వినిపిస్తోంది. ఈ మూవీ ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ కావడంతో ఇప్పుడు ఓటీటీలోకి కాస్త లేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. మే 3వ తేదీన గానీ లేకపోతే మే ఆఖరు వారంలో గాని ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×