E-Paper
Advertisement

VD12 Release Date: ‘విడి12’ కొత్త పోస్టర్.. విజయ్ దేవరకొండ ఏమున్నాడురా బాబోయ్

VD12 Release Date: ‘విడి12’ కొత్త పోస్టర్.. విజయ్ దేవరకొండ ఏమున్నాడురా బాబోయ్
Advertisement

VD12 new movie First Look Poster(Telugu film news): రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం మంచి హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే గతంలో విజయ్ ఆశలన్నీ ‘లైగర్’పై పెట్టుకున్నాడు. ఎన్నో అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసింది. బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో విజయ్ లైగర్ పై పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. అయినా పట్టువదలకుండా.. విజయపజయాలతో సంబంధం లేకుండా పలు సినిమాలు చేశాడు.

అందులో లైగర్ తర్వాత చేసిన సినిమా ఖుషి. ఈ మూవీ కూడా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీసు వద్ద మాత్రం పర్వాలేదనిపించుకుంది. కలెక్షన్లు కూడా ఓ మోస్తారుగా వచ్చాయి. ఆ వెంటనే మరో సినిమా చేశాడు. తనకు ఇదివరకే ‘గీతా గోవిందం’ సినిమాతో ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు పరశురామ్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా చేశాడు. ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్క అప్డేట్‌తో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది.

Advertisement

ఇక అలాంటి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కూడా పర్వాలేదనిపించుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. కానీ యూత్‌ మాత్రం ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. అయినా సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇలా తన కెరీర్‌లో చేసిన ఈ మూవీలు బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించుకున్నాయి. కానీ విజయ్‌కు మాత్రం మంచి హిట్‌ను అందించలేకపోయాయి. అందువల్లనే ఈ సారి ఎలాగైన ఒక బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని విజయ్ నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే పలు సినిమాలను లైన్‌లో పెట్టాడు.

Also Read:  VD12 లుక్ లీక్.. ఊర మాస్ అవతార్ లో రౌడీ హీరో..

Advertisement

అందులో ‘VD12’ మూవీ ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ మూవీ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండను మునుపెన్నడూ చూడని విధంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలోని సుందరమైన ప్రదేశాల్లో పూర్తయింది. 60 శాతం షూటింగ్ పూర్తి అయినందున మేకర్స్ తాజాగా ఓ అద్బుతమైన అప్డేట్ అందించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విజయ్ దేవరకొండ‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2025 మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో విజయ్ దేవరకొండ అగ్రసివ్‌గా బాడీ మొత్తం వాటర్‌తో చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ సినీ ప్రియుల్లో సరికొత్త క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇకపోతే ఈ మూవీ అఫీషియల్ టైటిల్‌ను ఈ నెలలో అంటే ఆగస్టులో రివీల్ చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

 

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×