BigTV English
Advertisement

Vijay Devarakonda: VD12 లుక్ లీక్.. ఊర మాస్ అవతార్ లో రౌడీ హీరో..

Vijay Devarakonda: VD12 లుక్ లీక్.. ఊర మాస్ అవతార్ లో రౌడీ హీరో..

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. లైగర్ ప్లాప్ తరువాత దాన్ని నుంచి బయటపడడానికి విజయ్ చాలా కష్టపడుతున్నాడు. కానీ, అది సులువుగా అనిపించడం లేదు. ఇక ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, అది కూడా విజయ్ ను కాపాడలేకపోయింది.


ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ VD12 మీదనే పెట్టుకున్నాడు. జెర్సీ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక్క అప్డేట్ ఇచ్చింది లేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే VD12 సెట్స్ నుంచి విజయ్ లుక్ లీక్ అయ్యింది.


రగ్గడ్ లుక్ లో విజయ్ అదరకొట్టేశాడు. ఇంతకు ముందెన్నడూ విజయ్ ఈ లుక్ లో కనిపించింది లేదు. గుండు.. గడ్డం, గాగుల్స్ తో పక్కా మాస్ రౌడీలా కనిపించాడు. ఈ మధ్యనే శ్రీలంకలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ లీక్డ్ ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విజయ్ ను ఈ లుక్ లో చూసిన అభిమానులు ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×