E-Paper
Advertisement

Vijay Devarakonda: బాడీగార్డ్ పెళ్ళిలో విజయ్ దేవరకొండ సందడి..

Vijay Devarakonda: బాడీగార్డ్ పెళ్ళిలో విజయ్ దేవరకొండ సందడి..
Advertisement

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ మేడ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. చిన్నతనం నుంచి నటనపై ఆసక్తితో ఒక్కోమెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. ఇక అభిమానుల కోసం, తనను అభిమానించేవారి కోసం విజయ్ ఏదైనా చేస్తాడు. తన ప్రతి పుట్టినరోజుకు అభిమానులకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. అవసరమని అడిగినవారికి కాదనకుండా సహాయం చేస్తాడు.

ఇక తాజాగా విజయ్ దేవరకొండ తన బాడీగార్డ్ అయిన రవి పెళ్లిలో సందడి చేశాడు. సాధారణంగా సెలబ్రిటీలు.. తమ దగ్గర పనిచేసే వారి పెళ్లిళ్లకు వెళ్లరు. ఒకవేళ వెళ్లినా అలా వెళ్లి ఇలా వచ్చేస్తారు. కానీ, విజయ్ మాత్రం తన పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి కుటుంబంతో సహా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాడు. వెడ్డింగ్ కార్డు ఇవ్వడమే కానీ, వస్తారో రారో అనుకున్న రవికి.. సడెన్ గా విజయ్ ఫ్యామిలీని చూసి షాక్ అయ్యినట్లు కనిపిస్తున్నాడు. వెంటనే రవి.. తన బాస్ విజయ్ కు ఘనస్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించాడు. అనంతరం తన భార్యను పరిచయం చేసి ఆశీర్వాదాలు అందుకున్నాడు.

Advertisement

ఇక రవితో కొద్దిసేపు ముచ్చటించిన విజయ్.. వారికి మంచి గిఫ్ట్ ను కూడా అందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక విజయ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతనికి ఒక భారీ హిట్ అవసరం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×