Big Stories

Vishal Patel Comments: ఎవ్వరి మాట విననన్న మాజీ సీఎం మనవడు.. చివరకు..

Vishal Patel Comments: మహారాష్ట్రలోని సాంగ్లీ లోక్ సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్ ను ఉపసంహరించుకునేలా పార్టీ నాయకుడు విశాల్ పాటిల్ ను ఒప్పించడంలో కాంగ్రెస్ విఫలమైంది. దీంతో సాంగ్లీ లోక్ సభ స్థానం నుంచి త్రిముఖ పోరు నెలకొన్నది. ఈ క్రమంలో విశాల్ ను ఎన్నికల నుంచి వైదొలగాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రయత్నించారని, అయినా కూడా అతను వినలేదని, దీంతో అతనిపై పార్టీకి సంబంధించిన క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని అక్కడి కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, విశాల్ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో 1.64 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. విశాల్ సాంగ్లీ నియోజకవర్గంలో బలమైన నాయకుడు అని, ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని ఆయన మద్దతుదారులు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

- Advertisement -

Also Read:మీకు క్షమాపణలు చెప్పేందుకే నేను ఇక్కడికి వచ్చాను: పవార్

- Advertisement -

అయితే, శివసేన(యుబిటి) అభ్యర్థి ఇప్పటికే ప్రచారం ప్రారంభించారని, కానీ ఇప్పటివరకు స్థానిక కాంగ్రెస్ నేతలెవరూ ఆ ప్రచారంలో పాల్గొనలేదని.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్ తన వెంటే ఉందని విశాల్ పాటిల్ అంటున్నారని.. పార్టీ తనకు టికెట్ కేటాయించకపోయినా సరే తాను ప్రజల కోరిక మేరకే బరిలో నిల్చుంటున్నానని.. ఖచ్చితంగా తాను విజయం సాధిస్తానని విశాల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడని అందులో పేర్కొంటున్నారు. అయితే, సాంగ్లీ నియోకవర్గం నుంచి త్రిముఖ పోటీ నెలకొనడంతో అక్కడ ప్రస్తుతం పోటీ ఆసక్తిగా మారింది. విశాల్ పాటిల్ మహారాష్ట్ర మాజీ సీఎం వసంత్ దాదా పాటిల్ మనవడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News