E-Paper
Advertisement

IPL 2024 Records: ఐపీఎల్.. ఒకవైపు రికార్డులు.. మరోవైపు విమర్శలు!

IPL 2024 Records: ఐపీఎల్.. ఒకవైపు రికార్డులు.. మరోవైపు విమర్శలు!
Advertisement

Indian Premier League 2024 Records: ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబయి వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కొన్ని రికార్డ్స్ నమోదయ్యాయి. ముఖ్యంగా యజ్వేంద్ర చాహల్ 200 వికెట్లు తీసుకున్న తొలి ఐపీఎల్ క్రికెటర్ అయ్యాడు. తర్వాత రాజస్థాన్ ఆటగాడు యశస్వి జైశ్వాల్ సెంచరీతో తన ఖాతాలో మరో రికార్డ్ నమోదైంది.

23 ఏళ్ల వయసులో రెండు సెంచరీలు చేసిన ఐపీఎల్ తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా ఒక రికార్డ్ నమోదు చేసింది. అదేమిటంటే 8 మ్యాచ్ ల్లో 7 మ్యాచ్ లు నెగ్గిన ఐదో జట్టుగా నిలిచింది. అంతకు ముందు ముంబయి (201), పంజాబ్ (2014), చెన్నయ్ (2019), గుజరాత్ (2022) ఉన్నాయి.

Advertisement

వ్యక్తిగత రికార్డులు, జట్టు పరంగా రికార్డులు బాగానే నమోదవుతున్నాయి. కానీ ఎంతవరకు తమ రికార్డులతో జట్టు విజయానికి ఉపయోగపడుతున్నారనే అంశంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజున యశస్వి సెంచరీ చేశాడు. రాజస్థాన్ గెలిచింది. మొన్న జాస్ బట్లర్ కోల్ కతాపై సెంచరీ చేశాడు. రాజస్థాన్ గెలిచింది.

Also Read: Mobile Offer : ఊహించని బంపర్ ఆఫర్.. సగం ధరకే సామ్‌సంగ్ ఫోన్!

Advertisement

అంతకుముందు రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ముంబయి ఓడిపోయింది. అలాగే విరాట్ కొహ్లీ కూడా సెంచరీ చేశాడు. అయినా ఆర్సీబీ ఓడిపోయింది. లోపం ఎక్కడుంది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఒక్కరు సెంచరీలు చేయడం వల్ల మ్యాచ్ లు గెలవరు, ఇది 11 మంది ఆటగాళ్లు కలిసికట్టుగా ఆడితేనే గెలుస్తుంది? అనే సంగతి అందరికీ తెలియాల్సిన అవసరం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే సెంచరీ చేయగానే ఆటగాళ్లను ఆకాశానికెత్తేస్తున్నారు. మిగిలిన ఆటగాళ్లు ఎంత గొప్పగా సపోర్టు చేసినా, బౌలర్లు తమ కర్తవ్యాన్ని నిర్వహించినా వారిని పట్టించుకోవడం లేదు. ఇది దారుణమని అంటున్నారు.

Also Read: Xiaomi 14 Civi : షియోమీ నుంచి కొత్త స్మార్ట్ ‌ఫోన్.. ధర ఎంతంటే?

ఈ రికార్డులపై కూడా సమగ్ర పరిశీలన జరగాలనే వాదనలు నెట్టింట వినిపిస్తున్నాయి. ఎవరో ఒక్కరిని హీరోను చేసే సంస్కృతి పోవాలని అంటున్నారు. ఎందుకంటే సెంచరీల కోసం జట్టు అవసరాలను కొందరు పట్టించుకోవడం లేదనే వాదనలు ఉన్నాయి.

జట్టు కోసం, జట్టు అవసరాల రీత్యా ఆడాలి తప్ప, వ్యక్తిగత రికార్డులు ఏ మాత్రం కరెక్టు కాదని కొందరంటున్నారు. ఈ అంశంపై తాను పోరాడుతున్నట్టు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాక్యానించడాన్ని నెట్టింట పలువురు కోట్ చేస్తున్నారు.ఇప్పటికైనా సెంచరీ హీరోలపై ఫోకస్ తగ్గించాలని నెటిజన్లు కోరుతున్నారు.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×