E-Paper
Advertisement

Vikram : హీరో విక్రమ్ కు తీవ్రగాయాలు.. తంగలాన్ సినిమా షూటింగ్ లో ప్రమాదం..

Vikram : హీరో విక్రమ్ కు తీవ్రగాయాలు.. తంగలాన్ సినిమా షూటింగ్ లో ప్రమాదం..
Advertisement

Vikram : తమిళ హీరో విక్రమ్ ప్రమాదానికి గురయ్యారు. తంగలాన్ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. వెంటనే చియాన్ ను ఆస్పత్రికి తరలించారు. విక్రమ్ కు పక్కటెముక విరిగిందని వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ అవసరమని ప్రకటించారు. చియాన్‌ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్ . పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. అడ్వెంచరస్‌ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Advertisement

ఇటీవల భారీ మల్టీస్టారర్‌ పొన్నియన్ సెల్వన్‌-2తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్‌ . ఇందులో ఆదిత్య కరికాలన్‌ పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. తంగలాన్ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో చియాన్ ప్రమాదానికి గురికావడంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

గతవారం వరకు పొన్నియన్ సెల్వన్ 2 ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు విక్రమ్‌. తంగలాన్ షూటింగ్‌లో మంగళవారం మళ్లీ చెన్నైలో ప్రారంభమైంది. ఇప్పటివరకు 80 శాతం షూటింగ్ పూర్తైంది. ఈ మూవీని 2024 ప్రథమార్థంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్‌ బర్త్‌ డే సందర్భంగా ఇటీవలే విడుదల చేసిన తంగలాన్‌ గ్లింప్స్ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఈ చిత్రం 2డీ, 3డీ ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకురాబోతోంది.

Advertisement

తంగలాన్ లో మాళవికా మోహనన్‌, పార్వతి తిరువొత్తు ‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్‌ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. విక్రమ్‌ మరోవైపు గౌత‌మ్ వాసు దేవ్ మీనన్ డైరెక్షన్‌లో ధ్రువ నక్షత్రం మూవీ కూడా చేస్తున్నాడు. స్పై థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో ఐశ్వర్యారాజేశ్‌, సిమ్రాన్‌, రాధికా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×