BigTV English

Lucknow vs Chennai:- లక్నో వర్సెస్ చెన్నై.. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిచేదెవరు?

Lucknow vs Chennai:- లక్నో వర్సెస్ చెన్నై.. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిచేదెవరు?

Lucknow vs Chennai:– లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఈ రెండు జట్లు చెరో 9 మ్యాచ్‌లు ఆడాయి. రెండు జట్లు కూడా నాలుగు మ్యాచ్‌లు గెలిచి చెరో 10 పాయింట్స్‌ సంపాదించుకున్నాయి. అయితే, లక్నో మాత్రం చెన్నై కంటే ఓ పొజిషన్ పైన ఉంది. జస్ట్ 0.3 నెట్ రన్ రేట్ కారణంగా.. లక్నో ఒక మెట్టు పైనుంది. ఈ రెండు జట్లకు ప్లేఆఫ్ బెర్త్‌కు వెళ్లేందుకు చాలా అవకాశాలు ఉన్నాయిం. అంతే కాదు.. టాప్-2 పొజిషన్ కోసం పోటీపడాల్సి వస్తే… ఆ జట్లు కూడా లక్నో అండ్ చెన్నైనే. కాని, గెలవాల్సిన మ్యాచులలో ఓడిపోతూ.. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లను కోల్పోతూ.. అంత ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాయి. గాయం కారణంగా కెఎల్ రాహుల్ లక్నో జట్టుకు దూరం అయ్యాడు. రాహుల్ లేని లోటు నిజంగా తీర్చలేనిదే. అటు చెన్నై జట్టు సారథి మహేంద్రసింగ్ ధోనీ కూడా మోకీలు నొప్పితో బాధపడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్‌లో ధోనీ ఇబ్బంది పడడం స్క్రీన్‌పై కనిపించింది. అయితే, అటు కేఎల్ రాహుల్, ఇటు ధోని ఆడతారా లేదా అని ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. చెన్నై జట్టు లాస్ట్ రెండు మ్యాచులలోనూ ఓడిపోయింది. ఈ మ్యాచ్ గెలవడం చెన్నై సూపర్ కింగ్స్‌కు చాలా ఇంపార్టెంట్. అటు లక్నో జట్టు కూడా వరుస విజయాలతో వెళ్లడం లేదు. పడుతూ లేస్తూ జర్నీ కంటిన్యూ చేస్తోంది. కాకపోతే, గతంలో ఈ రెండు జట్లు తలపడినప్పుడు మాత్రం థ్రిల్లింగ్ మ్యాచ్‌గా సాగాయి. లక్నోపై చెన్నై హైస్కోర్ చేసింది. ఆ మ్యాచ్‌లో మొయిన్ అలీ నాలుగు వికెట్లు తీసి.. లక్నో మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. మళ్లీ అలాంటిదే రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలి. పిచ్ రిపోర్ట్: లక్నో వాజ్‌పేయి స్టేడియం గ్రౌండ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. కాస్త బౌన్స్ ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. స్పిన్ బౌలింగ్ ఎదుర్కోడానికి చెన్నై జట్టు రెడీగా ఉంది. డెవోన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే స్పిన్ హిట్టర్స్‌గా ఉన్నారు. ఈ ముగ్గురితో చెన్నై మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఇక హోం గ్రౌండ్ తమకు అనుకూలిస్తుందన్న ఆశతో ఉంది లక్నో. చూడాలి.. ఇవాళ్టి మ్యాచ్‌లో చెన్నై హ్యాట్రిక్ ఓటమితో ముగిస్తుందా, హ్యాట్రిక్‌కు చెక్ పెడుతుందా అని.


Related News

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Big Stories

×