BigTV English

Science Behind Selfie : సెల్ఫీ వెనుక సైన్స్.. బయటపెట్టిన పరిశోధకులు..

Science Behind Selfie : సెల్ఫీ వెనుక సైన్స్.. బయటపెట్టిన పరిశోధకులు..

Science Behind Selfie : ఒకప్పుడు ఫోటో దిగడం చాలా పెద్ద విషయం. తరాలు మారుతున్నకొద్దీ ఫోటోలు దిగడం కోసం ఫోటో స్టూడియోలు ఏర్పాటు చేశారు. ముందుగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత కలర్ ఫోటోలు వచ్చాయి. ఫోన్లు తయారైన తర్వాత కెమెరా ఫోన్లతో ఫోటోల కథే మారిపోయింది. ఇక స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఫోటోల పేరు కూడా మార్చేశారు. సెల్ఫీ అంటూ కొత్త ట్రెండ్‌కు తెరలేపారు. అయితే ఈ సెల్ఫీల వెనుక కూడా ఒక సైన్స్ ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.


ఒకప్పుడు సెల్ఫీల కోసం విచిత్రమైన సాహసాలు చేసేవారు. కానీ ఒకప్పుడు ట్రెండ్ అయింది ఏదైనా కొన్నిరోజుల తర్వాత ఫేడ్ అయిపోవాల్సిందే. అందుకే ఇప్పుడు చాలామంది సెల్ఫీలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సెల్ఫీ అంటే చిరాకుపడేవారు కూడా ఉన్నారు. కానీ సెల్ఫీ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, ఒక మూమెంట్‌ను అందమైన జ్ఞాపకంగా మార్చుకోవడానికి సెల్ఫీ ఉపయోగపడుతుందని పరిశోధకులు తేల్చారు.

మామూలుగా సెల్ఫీ తీసుకునేవారు ఆ మూమెంట్‌ను మాత్రం క్యాప్చర్ చేయాలనుకుంటారు. కానీ కొంతమందికి మాత్రం ఆ మూమెంట్‌ను మరింత అందంగా తీయాలని ఆశపడతారు. అలాంటి సమయంలోనే వారిలోనే క్రియేటివిటి బయటికొస్తుంది. అలాంటివారు మూమెంట్‌ను క్యాప్చర్ చేస్తూ ఎంజాయ్ చేస్తారని పరిశోధకులు గమనించారు. గత కొన్నేళ్లుగా మనిషి జీవితంలో జరుగుతున్న మార్పులను ఫోటోల రూపంలో దాచుకోవడం అనేది అలవాటు అయిపోయింది. అందులో ఎక్కువభాగం సెల్ఫీలు తీసుకున్నాయి.


సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత కేవలం సెల్ఫీలు తీసుకోవడం మాత్రమే కాదు.. మనం తీసిన సెల్ఫీలను నలుగురికి చూపించాలని ఆశపడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో రోజుకు మిలియన్ ఫోటోలు షేర్ అవుతున్నాయి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో ఫోటోలు తీసుకుంటారు. ఇష్టమైన వారితో ఒక ఈవెంట్‌ను క్యాప్చర్ చేయడానికి, ఒక అందమైన దృశ్యాన్ని క్యాప్చర్ చేయడానికి.. ఇలా రకరకాల కారణాలతో మనం తీసే ఫోటో మనకు స్పెషల్‌గా మారుతుంది.

దాదాపు 2000 సంవత్సరం వచ్చేవరకు సెల్ఫీ అనే పదం చాలామంది పరిచయం లేదు. ఆ తర్వాత ఆ పదం వైరల్ అవ్వడంతో పాటు చాలామంది సెల్ఫీ అడిక్ట్స్‌గా కూడా మారారు. 2010 తర్వాత సెల్ఫీలకు ఉన్న క్రేజే మారిపోయింది. కెమెరాను చూసుకుంటూ ఫోటోలు తీసే టెక్నిక్‌కు సెల్ఫీ అనే అందమైన పేరు పెట్టి స్మార్ట్‌ఫోన్స్ తమ బిజినెస్‌ను పెంచుకున్నాయి. అయితే సెల్ఫీలు కేవలం జ్ఞాపకాల కోసం మాత్రమే కాదని.. అది మనకు నచ్చే అందమైన మూమెంట్‌ను క్యాప్చర్‌ చేయడం కోసం మనసు కోలుకునే ఆహ్లాదం అని పరిశోధకులు నిర్ధారించారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×