E-Paper
Advertisement

Chiyan Vikram – Suriya : క్రేజీ కాంబో.. స్టార్ డైరెక్టర్ తో సూర్య – చియాన్ విక్రమ్ మూవీ..

Chiyan Vikram – Suriya : క్రేజీ కాంబో.. స్టార్ డైరెక్టర్ తో సూర్య – చియాన్ విక్రమ్ మూవీ..
Advertisement

Chiyan Vikram – Suriya : సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు రావడం కామన్.. ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ మధ్య వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలలో త్రిపుల్ ఆర్ ఒకటి. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. అవి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు క్రేజీ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు సమాచారం.. తమిళ స్టార్ హీరోలతో స్టార్ డైరెక్టర్ ఓ మూవీ చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ క్రేజీ కాంబో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలుగు చలన చిత్ర రంగంలో వీరిద్దరూ ఎన్నో ఏళ్లుగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వీరి సినిమాలు ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. తమిళ ఇండస్ట్రీ లో స్టార్డం ఉన్న యాక్టర్స్ లో వీరిద్దరూ ఉన్నారు. ఇక అలాగేఅతి కొద్దిమంది దర్శకదిగ్గజాల్లో ముందువరుసలో ఉంటాడు శంకర్. ఈ ముగ్గురి కాంబోలో సినిమా వస్తుందంటే ఎలా ఉంటుంది. అభిమానులు, మూవీ లవర్స్‌కు పండగే అని చెప్పాలి.. తమిళ్లో ఇలాంటి క్రేజీ కాంబోలో సినిమాలు వచ్చినట్లు లేదు. ఇప్పుడు ఈ కాంబోలో వస్తున్న సినిమా పై ఇప్పటి నుంఛే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాను స్క్రీన్ మీద ఎప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Vikram Surya's new movie directed by Shankar
Vikram Surya’s new movie directed by Shankar
Advertisement

త్రయం విజువల్‌ ట్రీట్‌లా ఉండబోయే సినిమా చేయబోతున్నారన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. వెల్పరి నవల ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు శంకర్ రెడీ అవుతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇక మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా మూడు పార్టులుగా ఉండబోతుందట. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని, అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే వీరి కలయికలో సినిమా రావడం పక్కా అయిపోయినట్టేనని తెలుస్తోంది. ఈ వార్త నిజంగా ఈ కాంబోలో సినిమా వస్తే థియేటర్లు దద్దరిల్లి పోతాయని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..

ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి సూర్య, విక్రమ్‌, శంకర్ ఏదైనా హింట్‌ కానీ, అప్‌డేట్ కానీ ఇస్తారేమో చూడాలి. శంకర్ ప్రస్తుతం ఇండియన్ 3 సినిమాతోపాటు గేమ్‌ ఛేంజర్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. సూర్య ఖాతాలో కంగువ, సూర్య 43, సూర్య 44 ఉన్నాయి. అటు విక్రమ్ రీసెంట్ గా తంగలాన్ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×