BigTV English

OYO Hotel Owner Cheats Customer: కస్టమర్‌ను మోసం చేసిన ఓయో హోటల్ ఓనర్.. మండిపడిన కోర్టు!

OYO Hotel Owner Cheats Customer: కస్టమర్‌ను మోసం చేసిన ఓయో హోటల్ ఓనర్.. మండిపడిన కోర్టు!

OYO Hotel Owner Cheats Customer| ఇటీవల ఓ కస్టమర్ ఓయో హోటల్ లో రెండు రూమ్‌లు ఆన్ లైన్ బుకింగ్ చేసుకున్నాడు. ఆ తరువాత రాత్రి వేళ హోటల్ కు వెళ్లి చూస్తే షాకై పోయాడు. అక్కడ జరిగింది అతను అసలు ఊహించలేదు. ఆ తరువాత పెద్ద గొడవ జరగడంతో విషయం కోర్టు వరకు వెళ్లింది. కోర్టు హోటల్ ఓనర్ కు రూ.లక్ష ఫైన్ విధించింది. అదనంగా కోర్టు ఖర్చుల కోసం రూ.10 వేలు కూడా ఇవ్వాలని ఆదేశించింది.


వివరాల్లోకి వెళితే.. కేరళలోని ఎర్నాకులం లో అరుణ్ దాస్ అనే వ్యక్తి పది రోజుల క్రితం ఓయో హోటల్ బుకింగ్ యాప్ ద్వారా రెండు హోటల్ రూమ్స్ బుక్ చేసుకన్నాడు. రెండు రోజుల తరువాత అరుణ్ దాస్ తాన భార్య పిల్లలు, తల్లిదండ్రులతో పాటు రాత్రి వేళ కారులో హోటల్ కు వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లగా.. అరుణ్ దాస్ బుక్ చేసుకున్న రూమ్స్.. హోటల్ యజమాన్యం ఇతరులకు ఇచ్చేసింది. పైగా రూమ్స్ ఖాళీలేవని తెలిపింది.

Also Read: సిబిఐ అధికారులగా పోజులిచ్చి రూ.4.4 కోట్లు దోపిడి.. మోసపోయిన డాక్టర్!


దీంతో అరుణ్ దాస్ తన బుకింగ్ రసీదులను చూపించాడు. అయినా హోటల్ అతడి రిజర్వేషన్ బుకింగ్ ని పట్టించుకోలేదు. అరుణ్ దాస్ అంత అర్ధరాత్రి వేళ తన కుటుంబం మొత్తం తీసుకొని వేరే ఊరు నుంచి వచ్చాడు. ఇప్పుడు అక్కడ బుక్ చేసుకున్న రూమ్స్ లేవని చెప్పగానే అరుణ్ దాస్ గొడవ చేశాడు. ఇంత రాత్రి వేళ తన ఫ్యామిలీని తీసుకొని ఎక్కడికి వెళ్లాలని గట్టిగా ప్రశ్నించాడు. దీనికి అక్కడి మేనేజర్ సమాధానం చెబుతూ.. రెండు రూమ్స్ కావాలంటే ఇస్తాం.. కానీ ప్రతి రూమ్ కి అదనంగా రూ.2500 ఒక రాత్రికి చెల్లించాలని డిమాండ్ చేశాడు.

అరుణ్ దాస్ వద్ద ఆ సమయానికి అంత డబ్బులు లేకపోవడంతో అది కుదరలేదు. దీంతో చేసేది లేక ఆ రోజు రాత్రి కారులోనే తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులను తీసుకొని సర్దుకోవాల్సి వచ్చింది. అయితే హోటల్ ఓనర్ పై అరుణ్ దాస్ కన్జూమర్ కోర్టులో కేసు వేశాడు. తన వద్ద రూమ్ బుకింగ్ కు డబ్బులు తీసుకున్న తరువాత ఆ హోటల్ ఓనర్ మరొకరి తన రిజర్వేషన్ గదులు ఇచ్చేశాడని వాదించాడు. తన జరిగిన నష్టాన్ని, తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులకు పరిహారం కావాలని అడిగాడు.

Also Read:  జూపార్క్ లో పాండాలను చూడడానికి ఎగబడిన జనం.. నకిలీ పాండాలని తెలియడంతో హంగామా!

అరుణ్ దాస్ కేసుని విచారణ చేసిన కన్జూమర్ కోర్టు.. హోటల్ యజమాన్యం పై రూ.లక్ష ఫైన్ విధించింది. అరుణ్ దాస్ కుటుంబానికి నష్టపరిహారంగా రూ.లక్ష చెల్లించి.. కోర్టు కేసు ఖర్చులకు గాను అదనంగా రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల లోపు బాధితులకు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది..

Also Read: ఎంత దారుణం.. 6 ఏళ్ల పాపను హత్య చేసి.. ఏమీ తెలియనట్లు బుకాయించిన పెద్దమనిషి

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×