E-Paper
Advertisement

OTT Movie : క్రేజీ మలయాళ మర్డర్ మిస్టరీ తెలుగులో… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : క్రేజీ మలయాళ మర్డర్ మిస్టరీ తెలుగులో… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

OTT Movie : ఓటిటిలో ప్రస్తుతం మలయాళ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసింది. ప్రతి వీకెండ్ ఓటిటి మూవీ లవర్స్ ఏ మలయాళ సినిమా ఓటీటిలోకి రాబోతోంది? అది తెలుగులో కూడా అందుబాటులో ఉందా లేదా? అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తాజాగా థియేటర్లలో రిలీజ్ అయిన 6 నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతున్న ఓ మలయాళ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. అదే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఆ మూవీ ఏంటి? తెలుగులో ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

తెలుగులో టైటిల్ ఛేంజ్ 

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మలయాళ మూవీ ఈ ఏడాది మార్చి 15న థియేటర్లలో సందడి చేసింది. ఈ మర్డర్ మిస్టరీ మూవీకి రెస్పాన్స్ బాగానే వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రాలేదు. ఈ మూవీ బాక్స్ ఆఫీసు వద్ద దాదాపుగా రూ.55కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుని ఓకే ఓకే టాక్ తెచ్చుకుంది. ఉల్లాస చంబన్ దర్శకత్వం వహించిన అంచక్కలకొక్కన్ అనే ఈ సినిమా ఇప్పుడు 6 నెలల తర్వాత తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే తెలుగు ఓటిటి స్ట్రీమింగ్ విషయంలో మాత్రం టైటిల్ ను ఛేంజ్ చేశారు మేకర్స్. చాప్రా మర్డర్ కేస్ అనే టైటిల్ తో ఈ మూవీ ఆహాలో తెలుగులో అందుబాటులోకి రాబోతోంది. సెప్టెంబర్ 26న చాప్రా మర్డర్ కేస్ మూవీ ఓటీటీలోకి రాబోతుందని ఇప్పటికే ఆహా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ సినిమా మొత్తం ఓ మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది.

చాప్రా మర్డర్ కేస్ (అంచక్కల్లకోక్కన్) సినిమాలో లుక్‍మన్ అవరన్, చెంబన్ వినోద్ జోస్ ప్రధాన పాత్రల్లో కన్పించారు. శ్రీజిత్ రవి, సెంథిల్ కృష్ణ, మణికందన్ ఆర్ ఆచారి, మేఘా థామస్, మెరిన్ మేరీ ఫిలిప్  కీలకపాత్రల్లో నటించారు. చాప్రా మర్డర్ కేస్ మూవీని చెంబోస్కి మోషన్ పిక్చర్స్ పతాకంపై చెంబన్ వినోద్ జోస్ నిర్మించారు. ఈ చిత్రానికి మణికందన్ అయ్యప్ప సంగీతం అందించారు.

Advertisement

Anchakkallakokkan' box office collections day 4: Lukman's action flick  collects Rs 1.17 crore | - Times of India

స్టోరీలోకి వెళ్తే…

చాప్రా మర్డర్ కేస్ మూవీ మొత్తం 1980 నేపథ్యంలో సాగుతుంది. అప్పట్లో కేరళ – కర్ణాటక సరిహద్దులో ఉండే ఓ గ్రామంలో జరిగిన ఒక హత్య చుట్టూ స్టోరీ తిరుగుతుంది. చాప్రా అనే భూస్వామి హత్యకు గురైన టైంలోనే వాసుదేవన్ అనే కానిస్టేబుల్ అప్పుడే అక్కడ జాబ్ లోకి వస్తాడు. అయితే అప్పటికే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ చాప్రా హత్య కేసును విచారిస్తూ ఉంటాడు. మరోవైపు తండ్రిని చంపిన వారిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని కసితో ఉంటారు చాప్రా కొడుకులు. ఈ క్రమంలోనే సినిమాలో పలు ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లు ఉంటాయి. అసలు చాప్రా ఎవరు, ఎందుకు చంపారు? ఈ మిస్టరీ చివరికి ఎలా వీడింది? అనే విషయాలు తెలియాలంటే చాప్రా మర్డర్ కేస్ అనే ఈ మూవీని సెప్టెంబర్ 26న చూడాల్సిందే.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×