E-Paper
Advertisement

Virupaksha:-  విరూపాక్షకు తప్పిన ఏజెంట్ ముప్పు.. ఈ సమ్మర్‌కి మిగిలింది తేజ్ సినిమానే

Virupaksha:-  విరూపాక్షకు తప్పిన ఏజెంట్ ముప్పు.. ఈ సమ్మర్‌కి మిగిలింది తేజ్ సినిమానే
Advertisement

Virupaksha:- హమ్మయ్య.. ఈ సమ్మర్ విన్నర్ విరూపాక్షనే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్ సినిమా.. విరూపాక్ష కలెక్షన్స్‌ను తగ్గించేస్తుంది అనుకున్నారు. కొత్త సినిమా కావడంతో కొంత కలెక్షన్స్ ఏజెంట్ కు కూడా వెళ్తాయి. హిట్ టాక్ వస్తే.. ఇక విరూపాక్షను మరిచిపోవాల్సి వచ్చేది. కాని, అలా జరగలేదు. ఏజెంట్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుని విరూపాక్షను మళ్లీ లైన్లో పెట్టింది.

Advertisement

విడుదలై వారం దాటుతున్నా సరే… విరూపాక్షకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలించింది. నిజానికి వేరే ఏ సినిమాలు లేకపోయి ఉంటే… విరూపాక్షకు తిరుగులేదు. మొదటి వారాన్ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 8.66 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ సొంతం చేసుకుంది. ఇక రెండో వారంలో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

ఇప్పుడు విరూపాక్షను నడిపించబోయేది అఖిల్ ఏజెంట్ సినిమానే. ఫస్ట్ డేనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఏదో పబ్జీ గేమ్ చూసినట్టు ఉందంటున్నారు. సినిమాలో హీరో అఖిలా లేక మమ్ముట్టినా అనే డౌట్ కూడా వచ్చింది చాలా మందికి. అఖిల్ తనకు సరిపోయే కథను ఎంచుకోలేదన్నది మెయిన్ టాక్. పైగా స్పై సినిమాలకు ఉండాల్సిన గ్రిప్పింగ్ లేదనేది గట్టిగా వినిపిస్తోంది. ఎంతసేపూ, అఖిల్ బాడీని చూపించాలి, యాక్షన్ సీన్స్ చేయించాలనే తపనే కనిపించింది తప్ప అందులో స్టోరీనే లేదంటున్నారు. ఎమోషన్స్, లవ్ ట్రాక్స్, కామెడీ.. ఇవేవీ సెట్ కాలేదంటున్నారు. మొత్తానికి మరీ డిసాస్టర్ కాకుండా సోసోగా ఆడుతుంది.

Advertisement

మొత్తానికి, ఏజెంట్ టాక్ విరూపాక్షకు మళ్లీ లైఫ్ ఇచ్చినట్టైంది. ఈ వేసవిలో ఏ సినిమా చూద్దామనే ఆప్షన్స్ వెతుక్కున్నప్పుడు.. ఫస్ట్ కనిపించేది ప్రస్తుతానికి విరూపాక్షనే. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×