E-Paper
Advertisement

virupaksha movie update : ‘విరూపాక్ష’ డైరెక్టర్‌కి హెల్త్ ఇష్యూ… విషయం చెప్పేసిన సుకుమార్

virupaksha movie update : ‘విరూపాక్ష’ డైరెక్టర్‌కి హెల్త్ ఇష్యూ… విషయం చెప్పేసిన సుకుమార్
Advertisement
virupaksha movie update

virupaksha movie update : స్టార్ డైరెక్టర్ సుకుమార్ సినిమాలను తెరకెక్కించటంతో పాటు సినిమాల నిర్మాణంలో భాగమవుతుంటారు. కథలు, స్క్రీన్ ప్లేను అందిస్తుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆయన స్క్రీన్ ప్లే అందించిన చిత్రం ‘విరూపాక్ష’. ఏప్రిల్ 21న మూవీ రిలీజ్ అవుతుంది. సుక్కు శిష్యుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కార్తీక్‌ చాలా పెద్ద ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రీ రిలీజ్ సందర్భంగా సుకుమార్ ఈ విషయాన్ని చెప్పారు. వివరాల్లోకి వెళితే.. సుకుమార్ మాట్లాడుతూ ‘‘కార్తీక్ ముందు ఓ మంచి కథతో వచ్చాడు. నాకు కథ నచ్చలేదు. కానీ నెరేషన్ బాగా అనిపించింది. వేరే కథ చెప్పమని అన్నాను. అప్పుడు ఈ విరూపాక్ష చెప్పాడు. అద్భుతంగా అనిపించింది. ఆ తరువాత బాపిని పిలిపించి.. కథను చెప్పించాను. కార్తీక్‌ లైఫ్ చాలా క్రిటికల్ కండీషన్‌లో నా వద్దకు వచ్చాడు. మెడికల్ ప్రాబ్లం నుంచి బయట పడి.. ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. స్టెరాయిడ్స్ ఎక్కితే గానీ కార్తీక్ ప్లేట్ లెట్స్ పెరగవు. మీ అమ్మ గారి ఆశీర్వాదం వల్లే ఈ సినిమాను తీశాడు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ముందుకు వెళ్లడానికి మేం కాస్త సాయం చేశాం. కథను బాగా రాసుకున్నాడు.చక్కగా సినిమాను తీశాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఇండస్ట్రీలో మంచి దర్శకుడు అవ్వాలని కోరుకుంటున్నాను.

జగడం సినిమాను ప్లాప్ అయిన నన్ను ఎవ్వరూ నమ్మలేదు. కానీ ప్రసాద్ గారు నమ్మారు. నాకు నెలకు కొంత డబ్బు ఇస్తూనే వచ్చారు. శ్యాం గారి విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా హిట్ అయితే ఆయనకే మేజర్ క్రెడిట్ దక్కుతుంది. అజనీష్ అద్భుతమైన ఆర్ఆర్, సౌండ్ డిజైనింగ్ చేశాడు. నాగేంద్ర గారి సెట్‌లు అద్భుతంగా అనిపించాయి. అవి అసలు సెట్స్‌లానే అనిపించలేదు. ఎంతో నేచురల్‌గా కనిపించాయి. నవీన్‌తో నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలు చేశాను. సంయుక్త తెలుగు చాలా చక్కగా మాట్లాడింది. ఈ పాత్రకు సంయుక్తను తీసుకుంటాను అని అంటే ముందు నేను భయపడ్డాను. కానీ ఆమె అద్భుతంగా నటించింది. దిల్ రాజు గారి అమ్మాయి పెళ్లికి వెళ్లాం. అప్పుడే నేను సాయిని కలిశాను. అందర్నీ నవ్విస్తూనే ఉంటాడు. విరూపాక్ష సెట్‌లో మళ్లీ చూశాను. కానీ ఆ రోజు సెట్‌లో ఒక్కొక్క అక్షరాన్ని పట్టి పట్టి నేర్చుకుంటున్నాడు. ఇది ఆయనకు నటుడిగానూ పునర్జన్మలాంటిది. ఆ ప్రమాదం జరిగిన తరువాత సాయి నటించిన మొదటి సినిమా. ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

Advertisement

సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. యాక్సిడెంట్ తర్వాత తేజ్ నటిస్తోన్న సినిమా ఇది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×