BigTV English

CM Jagan: చంద్రబాబును నమ్మడం అంటే.. పులి నోట్లో తల పెట్టడమే: జగన్

CM Jagan: చంద్రబాబును నమ్మడం అంటే.. పులి నోట్లో తల పెట్టడమే: జగన్

CM Jagan: కృష్ణా జిల్లా గుడివాడ సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ కూటమిపై మండిపడ్డారు. తన మీద ఒక్కరాయి విసిరినంత మాత్రానా.. జరగబోయే ఎన్నికల్లో వైసీపీని విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని అన్నారు.


జగన్ మీద అంతమంది కలిసి దాడి చేస్తున్నారంటే వైసీపీ విజయం తథ్యం అయ్యిందని అర్థం అని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అర్జునుడిపై ఒక్క బాణం వేసినంత మాత్రాన.. కౌరువులు గెలిచినట్లు కాదన్నారు. దాడులతో తాను అదరను, బెదరను అని బల్లగుద్ది చెప్పారు. తన నుదిటిపై చేసిన గాయం.. తన సంకల్పాన్ని మరింత పెంచిందని జగన్ అన్నారు.

రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని చంద్రబాబు అన్నారు. ‘ఎస్సీలను, బీసీలను అపహేళన చేసింది చంద్రబాబే. చంద్రబాబును నమ్మడం అంటే.. పులి నోట్లో తల పెట్టడమే. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అని అన్నది చంద్రబాబే. నా నుదిటిపై చేసిన గాయం బహుశా పది రోజుల్లో తగ్గిపోతుందని కానీ.. పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు.


టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై చంద్రబాబు చెప్పులు వేయించి.. ఆయన చావుకు కారణం అయ్యారు. చంద్రబాబుకు మనసు, మానవత్వం లేదు. దాడులు, మోసాలు, కుట్రలే చంద్రబాబు నైజాం. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి వాటని మరచిపోయి.. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు ట్రాక్ రికార్డ్’ అంటూ జగన్ హాట్ కామెంట్స్ చేశారు.

Related News

Turakapalem: తురకపాలెంలో ICAR బృందం పర్యటన..

AP Politics: పార్టీ పదవుల కోసం.. టీడీపీలో డిమాండ్

Ayyanna Patrudu: స్పీకర్ సంచలన వ్యాఖ్యలు.. వరాలిచ్చే అధికారం తనకు లేదు, జగన్‌ నిర్ణమేంటి?

Tirupati To Shirdi: తిరుపతి నుంచి షిర్డీకి ప్రతీ రోజూ ట్రైన్.. సీఎం చంద్రబాబు సూచన, రైల్వేశాఖ ఆమోదం

TTD EO: టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్.. వైసీపీకి చెమటలు, ఈసారైనా ప్రక్షాళన జరిగేనా?

YS Raja Reddy: రాజారెడ్డికి అమ్మమ్మ ఆశీర్వాదం.. తల్లితోపాటు అక్కడికి, జగన్ టీమ్‌లో కలకలం

Big Stories

×