BigTV English

Akhil: అఖిల్ అంటే పడి చస్తున్న యాంకర్.. ఒక్కసారి చాలట?

Akhil: అఖిల్ అంటే పడి చస్తున్న యాంకర్.. ఒక్కసారి చాలట?

Akhil: అవును.. అక్కినేని అఖిల్ అంటే పిచ్చి అని అంటోంది ఓ స్టార్ యాంకర్. అఖిల్ అంటే.. తనకు చాలా ఇష్టమని సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతునే ఉంది. తాజాగా మరోసారి అఖిల్ పై తనకున్న ప్రేమను చెప్పుకొచ్చింది అమ్మడు. త్వరలోనే అఖిల్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. అయినా కూడా ఒకే ఒక్కసారి అంటూ.. బాహాటంగానే చెప్పేస్తోంది సదరు తెలుగు యాంకర్. ఇంతకీ ఎవరా హాట్ యాంకర్? అఖిల్ గురించి ఏం చెప్పింది?


అఖిల్‌తో ఒక్క ఛాన్స్!

తెలుగు యాంకర్ విష్ణుప్రియ (Vishnupriya) గురించి అందరికీ తెలిసిందే. ఈబ్యూటీకే అఖిల్ అంటే చాలా ఇష్టమట. ఇప్పటికే చాలాసార్లు అఖిల్ పై తన ఇష్టాన్ని బయటపెట్టింది విష్ణు ప్రియ. తాజాగా మరోసారి ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘అఖిల్‌తో డ్యాన్స్ చేసే ఒక్క అవకాశం వస్తే నా జీవితం ధన్యం అవుతుంది, రెమ్యునరేషన్ కూడా వద్దు, అఖిల్‌తో ఐటమ్ సాంగ్ అయినా చేయడానికి ఒకే’ అని చెప్పడం చూస్తే, ఆమెకు అఖిల్ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతోంది. అసలు అఖిల్ అంటే ఎందుకంత ఇష్టం అంటే? ‘పూర్వ జన్మ నుంచి అఖిల్ భక్తురాలిని, ఈ జన్మలో కూడా అది కొనసాగుతోంది’ అంటూ సమాధానం చెప్పింది. ఇక అఖిల్ సినిమా విడుదలైంది అంటే విష్ణు ప్రియ హంగామా మామూలుగా ఉండదు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. ఒక్క విష్ణు ప్రియ అనే కాదు.. అక్కినేని హీరోలకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. మన్మథుడు నాగార్జున (Nagarjuna)కు హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే.. ఇప్పుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaithanya), అఖిల్‌ (Akhil)కు కూడా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఈ లిస్ట్‌లో విష్ణుప్రియ కూడా ఉంది.


విష్ణుప్రియ గురించి!

విష్ణుప్రియ తన కెరీర్‌ను సినిమాలతో ప్రారంభించింది. మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు వంటి వివిధ భాషల సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించింది. కానీ విష్ణుప్రియకు అసలు గుర్తింపు బుల్లితెర ద్వారానే వచ్చింది. 2017లో ఈటీవీలో ప్రసారమైన “పోవే పోరా” షోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకర్‌గా చేసి బాగా పాపులర్ అయింది. ఈ షో ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమై, యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలో హీరోయిన్‌గా నటించి, బోల్డ్ పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంకా, “దయా” వంటి వెబ్ సిరీస్‌లలో కూడా కీలక పాత్రలు పోషించింది. అలాగే.. “బిగ్ బాస్ తెలుగు సీజన్ 8″లో కంటెస్టెంట్‌గా కూడా పాల్గొంది. అలాగే.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే విష్ణుప్రియకు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె తరచూ డ్యాన్స్ వీడియోలు, ఫోటో షూట్‌లు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అన్నట్టు ఇటీవల బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ఆమె పేరు వచ్చినప్పటికీ, ఆమె దానికి సంబంధించి పూర్తి బాధ్యత తన మేనేజర్‌దేనని చెప్పింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×