AAI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (ఫిజిక్స్, మ్యాథ్స్ ఉండాలి) పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు. ఓ సారి నోటిఫికేణ్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మే 24 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 309
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 24
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 25
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఉండాలి) లేదా బీటెక్ పాసై ఉండాలి.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.)
వయస్సు: 2025 ఏప్రిల్ 24 నాటికి 27 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అప్లికేషన్ వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, సైకో యాక్టివ్ సబ్‌స్టెన్‌సెస్ టెస్ట్, సైకాలజీకల్ అసెసిమెంట్ , ఫిజికల్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. సెలెక్ట్ అయిన వారికి రూ.40,000 నుంచి రూ.1,40,000 వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.aai.aero/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. సెలెక్ట్ అయిన వారికి రూ.40,000 నుంచి రూ.1,40,000 వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 309
దరఖాస్తుకు చివరి తేది: మే 24
ALSO READ: JOBS: టెన్త్, ఇంటర్‌తో మన హైదరాబాద్‌లో జాబ్స్.. భారీ వేతనం.. రేపే లాస్ట్ డేట్
ALSO READ: DMHO: గుడ్ న్యూస్.. టెన్త్ క్లాస్‌తో ఆ జిల్లాలో ఉద్యోగాలు.. మంచి వేతనం. వారం రోజులే గడవు