కుక్కలు అత్యంత విశ్వాసం కలిగిన జంతువులు. బుక్కెడు బువ్వ పెడితే, మన వెంటే తోక ఆడిస్తూ తిరుగుతుంటాయి. కాస్త ప్రేమగా చూసుకుంటే, మన మీద ఈగ వాలకుండా చూసుకుంటాయి. మన ఇంటి పరిసరాల్లోకి పురుగు, పుట్రను కూడా రానివ్వదు. తరచుగా వీధి కుక్కల విషయంలో రభస జరుగుతూ ఉంటుంది. కుక్కల బెడద ఎక్కువగా ఉంటే మున్సిపాలిటీ వాళ్లు పట్టుకెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు వీధి కుక్కలను చంపేస్తుంటారు. ఇలాంటి ఘటన పట్ల జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. మూగ జీవాల పట్ల ప్రేమను కనబర్చాలని చెప్తుంటారు. తాజాగా జరిపిన ఓ స్టడీలో వీధికుక్కల వల్ల ఎంతో మేలు జరుగుతున్నట్లు తేలింది.
వీధి కుక్కలతో కలిగే లాభాలు ఏంటి?
వీధి కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నేరాలు తక్కువగా జరుగుతాయని తేలింది. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు గణనీయంగా తగ్గినట్లు వెల్లడయ్యింది. కుక్కలు గుంపులుగా ఉండటం, తరచుగా మొరగడం కారణంగా దొంగలు ఆ ప్రాంతాల్లోకి వచ్చేందుకు భయపడతారని తేలింది. కుక్కలు ఎక్కువగా ఉంటే నేరాలు కచ్చితంగా తగ్గుతాయని చెప్పలేనప్పటికీ, కొన్ని రకాల నేరాలు తగ్గొచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
భద్రతా భావం: కుక్కలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు కుక్కలు లేని ప్రాంతాలలో ఉండే ప్రజలతో పోల్చితే సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. ఎలాంటి భయం లేకుండా ఉంటారు.
నేరాల నియంత్రణ: కొన్ని కుక్కలు నేరాలను నియంత్రించేందుకు సాయపడుతాయి. అనుమానకరంగా ప్రవర్తించే వ్యక్తులను గుర్తించి ప్రజలను అలర్ట్ చేస్తుంటాయి. అనుమానిత వ్యక్తులు తమ ప్రాంతంలోకి వచ్చినప్పుడు అరుస్తూ వారిని అడ్డుకునే ప్రయత్నిస్తాయి.
Read Also: అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంలోకి ట్రంప్ మామ ఎంట్రీ.. బ్యాన్ చేస్తారట!
కుక్కలతో లాభాలతో పాటు నష్టాలు కూడా!
కుక్కలు ఎక్కువగా ఉంటే, కొన్నిసార్లు అవి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయి. కొన్నిసార్లు చిన్న పిల్లతో పాటు పెద్దలపైనా దాడులు చేస్తుంటాయి. కొన్నిసార్లు అవి ఇతర జంతువులకు హాని కలిగిస్తాయి. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ కుక్కలతో కలిగి ఇబ్బందులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Read Also: 30 సెకన్లు తిట్టి.. 7 సెకన్ల వీడియో రిలీజ్ చేసిన అలేఖ్య చిట్టీ.. క్షమిస్తారా?
వీధికుక్కలతో కలిగి ముప్పు: వీధి కుక్కలు తరచుగా జనాలపై దాడి చేస్తూ ఉంటాయి. గాయపరుస్తాయి. కొన్నిసార్లు వ్యాధులు సోకేందుకు కారణం అవుతాయి. వీధి కుక్కలు ఎక్కువగా ఉంటే, ప్రజలు రోడ్డు మీద నడవడానికి, వాహనాలు నడపడానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కుక్కలు రోడ్ల మీద పడుకొని ఉండటం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వాహనదారులు చనిపోవడంతో పాటు మరికొన్నిసార్లు కుక్కలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ కుక్కల బెడద మరీ ఎక్కువగా ఉంటే సంబంధింత మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలి. వాటిని నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.
Read Also: చిక్కుల్లో అలేఖ్య చిట్టీ? నోరు జారితే ఎన్నేళ్ల జైలు శిక్షో తెలుసా?