E-Paper
Advertisement

Gaami & Premalu Movies in OTT: ఓటీటీలోకి వచ్చేసిన గామి.. ప్రేమలు.. మరో క్రేజీ మూవీ కూడా..!

Gaami & Premalu Movies in OTT: ఓటీటీలోకి వచ్చేసిన గామి.. ప్రేమలు.. మరో క్రేజీ మూవీ కూడా..!
Advertisement

Gaami & Premalu Movies Streaming on  OTT: ప్రముఖ ఓటీటీ సంస్థలు కొత్త కొత్త సినిమాలను రిలీజ్ చేసి ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు నెల లేదా అంతకంటే తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని .. కలెక్షన్ల వర్షం కురిపించిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ఎప్పట్నుంచో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న విశ్వక్ సేన్ ‘గామి’ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ5లో ఇప్పుడు ప్రసారం అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక అప్పుడు ఈ మూవీని థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఈజీగా చూసేయొచ్చు.

Advertisement

కాగా ఈ మూవీ గత నెలలో శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయింది. ఓ సమస్య కారణంగా హీరో ప్రాణాలకు ముప్పు ఉంటుంది. ఆ ముప్పు నుంచి బయటపడేందుకు ఓ మొక్క అతడికి అవసరం అవుతుంది. అయితే ఆ మొక్క హిమాలయాల్లో ఉంటుంది. అక్కడ త్రివేణి పర్వతం మీద 36 ఏళ్లకు ఒకసారి మాత్రమే మాలిపత్రి అనే మొక్క పుడుతుంది. దాని కోసం ఆ హీరో హిమాలయాలకు బయలు దేరుతాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి ఆపదలు ఎదురయ్యాయి. ఎలాంటి సమస్యలు వచ్చాయి అనేది సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు.

Also Read: రామ్ చరణ్‌కు డాక్టరేట్ ప్రకటించిన ప్రముఖ యూనివర్సిటీ.. కారణం ఇదే..!

Advertisement

అయితే దాదాపు రూ.10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు రూ.22 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసి అదరగొట్టేసింది. ఇందులో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో నటించి దుమ్ము దులిపేశాడు. అతడి యాక్టింగ్‌కు ప్రేక్షకాభిమానులు ఫిదా అయ్యారనే చెప్పాలి. ఇకపోతే ఈ మూవీతో పాటు మరో సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేసింది.

శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ కూడా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. లాజిక్ లేని కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను అప్పుడు థియేటర్లలో మిస్ అయితే ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు.

అలాగే మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రేమలు మూవీ కూడా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. నస్లెన్‌ కె గఫూర్ – మమితా బైజు కలిసి నటించిన ఈ మూవీ తెలుగు వెర్షన్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ‘ఆహా’లో ప్రసారం అవుతోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×