Big Stories

Baba Ramdev Patanjali Case: బాబా.. బ్లాక్‌షీప్! పతంజలి వెనుక కథ!

Baba Ramdev Patanjali Case Latest Update: పతంజలి.. అస్సలు ఇంట్రడక్షన్ అవసరం లేని కంపెనీ.. పతంజలి అనగానే రామ్ దేవ్ బాబానే గుర్తొస్తారు. యోగాతో ఆయనెంత ఫేమస్.. ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ లో పతంజలి అంత ఫేమస్.  అలాంటి పతంజలిని తిట్టిన తిట్టు తిట్టకుండా దుమ్ము దులిపేస్తుంది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. మీరు సారీ చెప్తే సరిపోదు.. మీరు చేసింది వ్యాపారం కాదు. క్రైమ్.. ఆ క్రైమ్ కు తగిన మూల్యం చెల్లించాల్సిందే.. మీ అంతు చూడకుండా వదిలేది లేదంటూ వార్నింగ్ ఇస్తోంది. ఇంతకీ పతంజలి పంచాయితీ ఏంటి? సుప్రీంకోర్టు ఈ రేంజ్ లో సీరియస్ అయ్యేందుకు రీజనేంటి? అసలు దీనికి బాధ్యులెవరు? బాధితులెవరు? అల్లోపతి, ఆయుర్వేదం.. రెండు రెండింటికి సాటే.. దేని విశిష్టిత దానిదే.. దేని గొప్పదనం దానిదే.. కానీ పతంజలి ఎప్పుడైతే.. అల్లోపతికి అంత సీన్ లేదు.

- Advertisement -

ఆయుర్వేదమే అల్టిమేట్ అనేలా యాడ్స్ మొదలెట్టిందో.. అదిగో అప్పుడు మొదలైంది పంచాయితీ.. 2021 ఫిబ్రవరి.. కరోనా సెకండ్ వేవ్ టైమ్.. సరిగ్గా అదే టైమ్‌లో పతంజలి బాస్ ఆచార్య బాలకృష్ణ, రామ్ దేవ్ బాబా.. ఓ టాబ్లెట్ ను లాంచ్ చేశారు.. దాని పేరు కరోనిల్. ఈ టాబ్లేట్ కరోనాను కంట్రోల్ చేస్తుందని ప్రచారం మొదలుపెట్టారు.. దీనికి వారిచ్చిన ట్యాగ్ లైన్.. ఫస్ట్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఫర్ కోవిడ్ 19.. ఈ లాంచింగ్ ఈవెంట్‌కు యూనియన్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ కూడా అటెండ్ అయ్యారు. ఈ పోస్టర్ పై కరోనిల్ ఫార్మాసిట్యూకల్ ప్రొడక్ట్ అని.. దీనికి WHO కూడా సర్టిఫికేట్ ఇచ్చిందని అనౌన్స్ చేశారు. కరోనా వ్యాక్సిన్ కోసం తలకిందులుగా తపస్సు చేస్తుంటే.

- Advertisement -

ఇంత ఫాస్ట్ గా అలా ఎలా టాబ్లెట్స్ తయారు చేశారు..? ఎప్పుడు ట్రయల్స్ చేశారు? ఎవరిపై చేశారు? WHO ఏం చూసి సర్టిఫికేట్ ఇచ్చింది? అని డౌట్స్ వచ్చాయి ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కి.. వెంటనే ఆరా తీస్తే.. అసలు WHO పతంజలికి ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని తేలిపోయింది. ఇన్ని అబద్ధాలు ఓ సెంట్రల్ మినిస్టర్ ముందే జరగడాన్ని IMA క్వశ్చన్ చేసింది.. హర్షవర్ధన్ ను ఎక్స్‌ప్లనేషన్ అడిగింది.. అటు వైపు నుంచి సైలెన్స్.. ఇది జరిగిన కొన్ని రోజులకే రామ్ దేవ్ బాబా వీడియో ఒకటి వైరల్ అయ్యింది.. కరోనా చావులకు అల్లోపతి ట్రీట్ మెంటే కారణం.. ప్రజలను దోచుకోవడమే వాళ్ల పని.. మోడ్రన్ ట్రీట్ మెంట్ కరోనాను నయం చేయలేదు. అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు యోగా గురు అందులో.. ఈ వీడియో వైరల్ కావడంతో IMA కు ఒళ్లు మండిపోయింది. రామ్ దేవ్ బాబాకు లీగల్ నోటీసులు పంపింది.

Also Read: మొన్న ఈడి, నేడు సీబీఐ..కవిత పరిస్థితేంటి?!

వెంటనే పబ్లిక్ గా క్షమాపణలు చెప్పాలని.. అతను చేసిన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసింది.. కానీ దీనికి కూడా కవర్ డ్రైవ్ వేసింది పతంజలి మేనేజ్ మెంట్.. రామ్ దేవ్ బాబా ఓ ఫార్వర్డ్ మెసేజ్ మాత్రమే చదివారని.. ఆయనకు మోడ్రన్ సైన్స్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని అనౌన్స్ చేసింది.. కానీ అప్పటికే కరోనిల్ కరోనా మెడిసిన్ అని జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంది.. ప్రజలు నిజమని నమ్మి.. అవి కొంటూనే ఉన్నారు.. పతంజలి డబ్బు సొమ్ము చేసుకుంటునే ఉంది.మరి ఇంతా జరుగుతుంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి..? యాక్చువల్ గా కరోనిల్ కు లైసెన్స్ తీసుకుంది ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పి.. కానీ 2020 డిసెంబర్ లో కోవిడ్ 19కి మెడిసిన్ అని అప్ గ్రేడ్ చేయాలని పతంజలి రిక్వెస్ట్ చేసింది. కానీ ఆ నెక్ట్స్ మంత్ కరోనాను తగ్గించేందుకు సపోర్ట్ చేస్తుందని లైసెన్స్ దక్కించుకుంది పతంజలి.. కానీ ప్రచారం మాత్రం కరోనాకు క్యూర్ అని చేసుకుంది.

మరి ఇదేంటని ప్రశ్నిస్తే అటు కేంద్రం, ఇటు ఉత్తరాఖండ్ సర్కార్ ఇచ్చిన ఎక్స్ ప్లనేషన్ ఏంటంటే.. కరోనిల్ అనేది కరోనాకు క్యూర్ కానేకాదు.. జింక్, విటమ్ సీ, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఎలానో.. సేమ్ కరోనిల్ కూడా అలాంటిదే.. అంతకుమించి మరేం కాదు.. అని ప్రకటించింది.. సుప్రీంకోర్టుకు కూడా ఇదే సమాధానం చెప్పింది కేంద్రం. సమాధానలు బాగానే ఉన్నాయి. కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీంతో పతంజలి మరింత బరితెగించిందనే చెప్పాలి.. 2022 ఆగస్టులో ఏకంగా న్యూస్ పేపర్స్ లో ఓ అడ్వర్ టైజ్మెంట్ ఇచ్చింది. అల్లోపతి అనేక అపోహాలు సృష్టిస్తోంది.. అల్లోపతి నుంచి మిమ్మల్ని, దేశాన్ని కాపాడుకోండి.. ఫార్మా, మెడికల్ ఇండస్ట్రీలు అనేక అపోహాలు స్రుష్టిస్తున్నాయి. అని దాని డిస్క్రిప్షన్.. అంతేకాదు.. పతంజలీ మెడిసిన్స్ తో డయాబెటిస్, బీసీ, థైరాయిడ్, ఆస్తమా, ఆర్థరైటీస్ తగ్గిపోయాయని తెలిపింది. దీంతో ఈసారి నోటీసులతో పని అవ్వదని భావించిన IMA.. ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Also Read: అన్న పైనే తమ్ముడి గెలుపు భారం.

ప్రజలను మిస్ లీడ్ చేస్తున్న పతంజలిపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే సుప్రీంకోర్టు 2023, నవంబర్ 21న గట్టి వార్నింగ్ ఇస్తూ ఫైన్ వేసింది కోర్టు.. ఇక నుంచి ఇలాంటి మిస్టేక్ జరగదని హామీ ఇచ్చింది పతంజలి. బట్ ఇచ్చిన మాటపై నిలబడలేదు పతంజలి. అలా చేస్తే ఇప్పుడు మనం ఈ డిస్కషన్ పెట్టకపోయే వాళ్లం.. ఈ ఇయర్ జనవరి 15న జరిగింది ఓ మిరాకిల్.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్‌కు ఓ ఆకాశరామన్న లేఖ వచ్చింది. జస్టిస్ కోహ్లీ, జస్టిస్ అమానుల్లాను కూడా ఇందులో మెన్షన్ చేశారు.. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా పతంజలి తీరులో అస్సలు మార్పు రాలేదని. మళ్లీ ప్రజలను మిస్‌ లీడ్ చేసేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ ప్రూఫ్స్‌తో సహా కోర్టుకు అందించారు. IMA కూడా దీనికి సంబంధించిన ప్రూఫ్స్‌ను అందించింది. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కోపం నషాళానికి అంటింది.. కోర్టుకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ఎలా తప్పుతారంటూ మండిపడింది.. అటు ఉత్తరాఖండ్‌ గవర్నమెంట్‌కు కూడా తలంటింది.

ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా అంటూ లెఫ్ట్‌ అండ్ రైట్ ఇచ్చింది.. కోర్టు ఈ రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చినా మార్చి 19 వరకు రిప్లై ఇవ్వలేదు పతంజలీ.. దీంతో రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణ ఇద్దరూ కూడా కోర్టు ముందు హాజరవ్వాలంటూ ఆదేశించింది.. దీంతో మార్చి 21న క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించారు.. కానీ కోర్టు మాత్రం ఊరుకునేది లేదని చెప్పింది.. చేసిందంతా చేసి సారీ అంటే సరిపోదంది.. మీ క్షమాపణలను యాక్సెప్ట్‌ చేసే సవాలే లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు.. చెప్పిన క్షమాపణలను కూడా మొదట మీడియాలో రిలీజ్ చేశారని.. కోర్టుకు మాత్రం సమర్పించలేదంటూ జస్టిస్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును కోర్టు ఎంత సీరియస్‌గా తీసుకున్నది అని చెప్పడానికి ఓ ఎగ్జాంపుల్.. కేసు విచారణ సందర్భంగా ఉత్తరాఖండ్ డ్రగ్స్ లైసెన్సింగ్ అధికారిపై ఫుల్‌ ఫైరయ్యింది ధర్మాసనం.

Also Read: Bengaluru Cafe Blast: బాంబ్ బ్లాస్ట్ నిందితుల మాస్టర్ ప్లాన్స్.. ఎలా తప్పించుకు తిరిగారో చూడండి(VIDEO)

దీంతో ఆయన చేతులు జోడించి.. అయ్యా ఆ డ్రగ్ లాంచ్ చేసినప్పుడు నేను పదవిలో లేను.. 2023లో వచ్చాను అని చెప్పారు.. అయినా కోర్టు మాత్రం అస్సలు తగ్గలేదు.. మరి వచ్చాక తీసుకున్నాక చర్యలేంటో చెప్పండి అని ప్రశ్నించింది.. మీరు క్షమించమని అంటున్నారు. బాగుంది. కానీ మరి కరోనాకు మందు అనుకొని ట్యాబెట్లు తీసుకున్న వారి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించింది. దీంతో అటు పతంజలి మేనేజ్‌మెంట్.. ఇటు ఉత్తరాఖండ్‌ అధికారులు నోరు మెదిపితే ఒట్టు. ఓవరాల్‌గా చూస్తే.. పతంజలి తప్పు చేసింది నిజం  ఎందుకంటే పదేపదే అందుకే క్షమాపణలు కోరుతున్నారు కాబట్టి.. అయితే తప్పని తెలిసి కూడా తప్పు చేశారు కాబట్టి పరిణామాలు ఎదుర్కోవాల్సిందే. ఇప్పటికి కూడా క్షమాపణలు పేపర్‌ ఉన్నాయి తప్ప వారి ఆలోచనల్లో లేవంటోంది కోర్టు.. సో నెక్ట్స్‌ పతంజలీకి భారీ దెబ్బ తగలడం ఖాయం.. అదేంటన్నది ఈ నెల 16న తేలనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News