E-Paper
Advertisement

Game Changer Release Date: కొడుకు కోసం తండ్రి కీలక నిర్ణయం, ‘విశ్వంభర’ స్థానంలోకి ‘గేమ్ ఛేంజర్‘?

Game Changer Release Date: కొడుకు కోసం తండ్రి కీలక నిర్ణయం, ‘విశ్వంభర’ స్థానంలోకి ‘గేమ్ ఛేంజర్‘?
Advertisement

Vishwambhara Movie Postponed: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’.  పిరిడికల్ మూవీగా తెరకెక్కతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, ఈ ఈ సినిమాకు రిలీజ్ వాయిదా పడబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొడుకు చెర్రీ కోసం తండ్రి చిరు తన సినిమాను రిలీజ్ ను వాయిదా వేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

సంక్రాంతి బరిలోకి చెర్రీ ‘గేమ్ ఛేంజర్’

Advertisement

రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది.  చివరగా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ కూడా కన్ఫామ్ చేశారు. కానీ, ఇప్పుడు ‘విశ్వంభర’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ‘గేమ్ ఛేంజర్’ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోసారి ‘గేమ్ ఛేంజర్’ పోస్టు పోన్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని ‘దసరా’ కానుకగా విడుదల చేయబోయే టీజర్ లో మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సమ్మర్ బరిలో మెగాస్టార్ ‘విశ్వంభర’

Advertisement

ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్లుగా ‘విశ్వంభర’ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటే.. ‘గేమ్ ఛేంజర్’కు గోల్డెన్ ఛాన్స్ గా భావించవచ్చు. తండ్రి సినిమా ప్లేస్ లోకి కొడుకు మూవీ వచ్చి చేరుతోంది.  నిజానికి ‘గేమ్ ఛేంజర్’ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఒకవేళ మూవీ రిలీజ్ వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తే.. వర్క్ క్వాలిటీ పెరిగి ఔట్ ఫుట్ మరింత బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రచారం ప్రకారం ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి విడుదల అయితే, ‘విశ్వంభర’   వేసవి కానుగా విడుదలయ్యే అవకాశం ఉంది. నిజానికి ‘విశ్వంభర’ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ సినిమా ప్రారంభంలోనే వెల్లడించారు. అందుకు అనుగుణంగానే షూటింగ్ పనులు జెట్ స్పీట్ తో కొనసాగించారు. కానీ, ఇప్పుడు రిలీజ్ విషయంలో క్లారిటీ రావడం లేదు. త్వరలోనే ఈ రెండు సినిమాల రిలీజ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇక ‘గేమ్ ఛేంజర్’ సినిమాను దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ‘విశ్వంభర’ సినిమాను ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. యువీ క్రియేషన్స్ సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×