BigTV English

Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ వాయిదా.. మళ్లీ అప్పుడే..

Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ వాయిదా.. మళ్లీ అప్పుడే..

Tirupati Laddu Row: తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంపై దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 4 (గురువారం) ఉదయం 10. 30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. లడ్డూ వివాదంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  దీనిపై సీబీఐతో విచారణ జరిపించేలా ఆదేశించాలని, అప్పుడు నిజానిజాలు బయటపడుతాయంటూ జగన్ కోరారు. బుధవారం ఈ పిటీషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ఈ సందర్భంగా విచారణ వాయిదా వేయాలంటూ సొలిసిట్ జనరల్ తుషార్ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో విచారణకు రేపటికి వాయిదా వేశారు.


అదేవిధంగా కేఏ పాల్ కూడా ఓ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ వివాదంపై పూర్తి స్థాయిలో సీబీఐ చేత దర్యాప్తు జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని అందులో కేఏ పాల్ పేర్కొన్నారు. అయితే, ఈ వివాదంపై ఇప్పటికే దాఖలైన మరో నాలుగు పిటిషన్లను ధర్మాసనం విచారించింది. ఆ సందర్భంగా సీఎం చంద్రబాబుకు పలు సూచనలు చేసింది. దేవుళ్లను పాలిటిక్స్ లోకి తీసుకురావొద్దని, ఇకముందు దేవుళ్ల విషయంలో అటువంటి వ్యాఖ్యలు చేయొద్దని పేర్కొన్నది.

Also Read: కేటీఆర్ ఏకాకి అయ్యారా.. సమంత, అక్కినేని ఫ్యామిలీకి టాలీవుడ్ సపోర్ట్.. బీఆర్ఎస్ నేతలు మాత్రం మౌనం!


ల్యాబ్ రిపోర్టు స్పష్టంగా లేదని, తిరస్కరించిన నెయ్యిని ల్యాబ్ కు పంపినట్లు అర్థమవుతోందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ‘ఇది ఉపయోగించిన నెయ్యి కాదని నివేదికను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.. మీకు ఖచ్చితంగా తెలియనప్పుడు మీరు ఈ విషయంలో పబ్లిక్ లో ఎలా మాట్లాడుతారు?’ అంటూ ప్రశ్నించింది.

లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యితోపాటు నాసిరకం పదార్థాలను ఉపయోగించారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు భక్తులలో తీవ్ర ఆందోళనను రేకెత్తించాయని, పవిత్ర ప్రసాదం యొక్క పవిత్రతను దెబ్బ తీశాయంటూ కేఏ పాల్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

‘పంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు అతి పెద్ద దేవాలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. లడ్డూ ప్రసాదం పట్ల వారు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటారు. లడ్డూ ప్రసాదాన్ని భక్తులు గొప్పగా భావిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న లడ్డూ పవిత్రతపై రాజీపడితే అది లక్షలాది మంది భక్తులను ప్రభావితం చేయడమే అవుతుంది. అంతేకాదు.. ఆ సంస్థ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా సంప్రదాయాలను అణగదొక్కకుండా చూసేలా చర్యలు తీసుకోవాలి’ అని కూడా పాల్ అందులో పేర్కొన్నారు.

Also Read: దసరా కానుకగా బంపర్ ఆఫర్.. మీకు ఈ శుభవార్త తెలిస్తే… వెంటనే అప్లై చేసేస్తారు!

కాగా, ఏపీలో గత వైసీపీ సర్కారు హయాంలో తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని ఉపయోగించారంటూ ఈ నెల మొదటి వారంలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఈ అంశం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన జగన్ మోహన్ రెడ్డి.. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఇటువంటి హీనమైన ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఆ తరువాత ఏపీ ప్రభుత్వం ల్యాబ్ రిపోర్టుకు సంబంధించిన రిపోర్టును కూాడా బయటపెట్టింది.

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×