E-Paper
Advertisement

Viswam Censor : శ్రీను వైట్ల కష్టానికి కత్తెర్లు… ఇక ఆ దేవుడే కాపాడాలి

Viswam Censor : శ్రీను వైట్ల కష్టానికి కత్తెర్లు… ఇక ఆ దేవుడే కాపాడాలి
Advertisement

Viswam Censor : నీకోసం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు శ్రీనువైట్ల. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కూడా శ్రీను వైట్లకు మాత్రం మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత శ్రీనువైట్ల చేసిన ప్రతి సినిమా కూడా కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయింది. అందరి దర్శకులలో కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన సైలని వేయించుకున్నారు శ్రీనువైట్ల. రీసెంట్ టైమ్స్ లో హిట్ లేకుండా శ్రీను వైట్ల సినిమాలో డల్ గా ఉన్నాయి కానీ ఒకప్పుడు శ్రీను వైట్ల సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉండేది. వెంకీ, దుబాయ్ శీను, సొంతం వంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు విపరీతమైన ఆనందాన్ని చేయి. ఇక శ్రీను వైట్ల కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అంటే దూకుడు అని చెప్పాలి. మహేష్ బాబు సమంత జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేవలం బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే కాకుండా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత చేసిన బాద్షా కూడా మంచి హిట్ అయింది. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు శ్రీను వైట్లకి సరైన హిట్ సినిమా పడలేదు.

ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. లేకపోతే శ్రీనువైట్ల ప్రస్తుతం విశ్వం అనే సినిమాను చేశారు. ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా హీరో గోపీచంద్ కూడా మాట్లాడుతూ ఈ సినిమాతో శ్రీను వైట్ల ఇస్ బ్యాక్ అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అలానే ఈ సినిమా ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. వెంకీ సినిమాలో ట్రైన్ కామెడీ ఎంత అద్భుతంగా వర్కౌట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కూడా అదే మాదిరిగా ట్రైన్ ట్రాక్ ను ఇన్వాల్వ్ చేశారు. ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని చాలామంది బిలీవ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా రీసెంట్ గా సెన్సార్ కు వెళ్ళింది. అయితే చాలా మట్టుకు సీన్స్ ను సెన్సార్ వాళ్లు కట్ చేసినట్లు సమాచారం వినిపిస్తుంది. ఒక సినిమా హిట్ అవ్వాలంటే కొన్ని సీన్స్ చాలా కీలకంగా ఉంటాయి. ఒకవేళ అలాంటి సీన్స్ ఈ సినిమాకి సంబంధించి పోతే శ్రీనువైట్ల కు రిజల్ట్ విషయంలో కొంచెం ప్రాబ్లం ఉన్నట్లే. అనవసరమైన సీన్ కట్ చేసినట్లయితే సినిమాకి ప్లస్ అయినట్లు కూడా చెప్పొచ్చు.

Advertisement

లేకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోస్ తో వర్క్ చేసిన ఘనత శ్రీను వైట్లకు ఉంది. కేవలం ఇప్పుడున్న స్టార్ హీరోస్ మాత్రమే కాకుండా, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ స్టార్ హీరోస్ కూడా శ్రీను వైట్ల వర్క్ చేసి సూపర్ హిట్స్ అందుకున్న. ఇక శ్రీనువైట్ల సినిమాలను ప్రస్తుతం యూట్యూబ్లో కూడా వెతుక్కోని చూసే ఆడియన్స్ ఉన్నారని చెప్పాలి. రీసెంట్ గా రవితేజ నటించిన వెంకీ సినిమా రీ రిలీజ్ కు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికీ చాలామందికి శ్రీనువైట్ల సినిమాలు ఒక స్ట్రెస్ బస్టర్ గా ఉంటాయి. లేకపోతే ఇప్పుడు చేస్తున్న విశ్వం సినిమా కేవలం శ్రీను వైట్లకు మాత్రమే కాకుండా గోపీచంద్, కావ్య, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వీళ్ళందరికీ కూడా ఒక హిట్ తీసుకొస్తుందని అందరూ నమ్ముతున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి హిట్స్ సాధిస్తుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చూడడానికి తప్పదు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×