BigTV English
Advertisement

OTT Movie : చనిపోయిన కూతురు తిరిగొచ్చి ఫ్యామిలీ ప్రాణాల్ని బలి కోరితే… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ

OTT Movie : చనిపోయిన కూతురు తిరిగొచ్చి ఫ్యామిలీ ప్రాణాల్ని బలి కోరితే… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ

OTT Movie : హర్రర్ మూవీస్ కి సపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి సినిమాలను ఇష్టపడేవారు ఇప్పటికే పలు ఓటిటిలలో ఉన్న హారర్ సినిమాలన్నింటిని చూసేసి ఉంటారు. అయితే ఎన్ని సినిమాలు చూసినా ఇలాంటి సినిమా రోజుకి ఒకటి పుట్టుకొస్తుంది. హర్రర్ సినిమాలకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఓటీటీలు ఇలాంటి సినిమాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ అరాచకం అనిపిస్తుంది. పైగా ఇది ఒక కొరియన్ హర్రర్ మూవీ కావడం మరో విశేషం. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? సినిమా పేరేంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


కథలోకి వెళ్తే…

హీరోయిన్ తల్లి పుట్టిన రోజు ఉంటుంది. ఈ సందర్భంగా ఒక స్పెషల్ వీడియోను రికార్డ్ చేయాలని, ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలని కూతురు ప్లాన్ చేస్తుంది. అయితే దానికోసం పక్కనే ఉన్న ఫారెస్ట్ నుంచి ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఏదో ఒకటి తీసుకురావాలని డిసైడ్ అవుతుంది. అనుకున్నదే తడవుగా తన ఫ్రెండ్ జాన్ అనే అబ్బాయిని తీసుకొని అడవిలోకి వెళ్లి వెతుకుతుంటుంది. కట్ చేస్తే హీరోయిన్ తో వెళ్లిన ఆమె ఫ్రెండ్ జాన్ ఒక్కడే ఇంటికి తిరిగి వస్తాడు. హీరోయిన్ ఎక్కడా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడతారు. అడవిలో తప్పిపోయింది ఏమో అనుకుని ఆ చుట్టుపక్కల వాళ్ళతో కలిసి హీరోయిన్ తల్లిదండ్రులు అడవిని జల్లెడ పడతారు. కానీ ఎంత వెతికిన ఆ అమ్మాయి కనిపించకపోవడంతో తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఇక ఏడు రోజులు అయ్యాక హీరోయిన్ ఇంకా తిరిగి రాకపోవడంతో ఫ్యామిలీ అంతా ఆమె చనిపోయిందని నిర్ణయించుకుంటారు. దానికి ప్రధాన కారణం వాళ్ళ ఇంట్లో ఉండే బుక్.


ఇక కూతురు చనిపోయిందని భావించిన ఆ ఫ్యామిలీ ఆచారాల ప్రకారం కర్మకాండలు కూడా నిర్వహిస్తారు. అయితే అందరూ హీరోయిన్ చనిపోయింది అని చెబుతున్నా ఆమె తల్లి మాత్రం అస్సలు ఒప్పుకోదు. తన కూతురు బ్రతికే ఉందని నమ్ముతుంది. ఆమె అనుకున్నట్టుగానే సడన్ గా ఓ రోజు హీరోయిన్ ఇంటికి వచ్చి అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. అయితే ఆమె ఫ్యామిలీలోనే ఒకరు అసలు ఆ అమ్మాయి తమ కూతురు కాదని, దయ్యమని హీరోయిన్ తండ్రికి హెచ్చరిస్తుంది. కానీ చాలా రోజుల తర్వాత కూతురు తిరిగొచ్చిందన్న సంతోషంలో ఆమె మాటల్ని ఎవ్వరూ లెక్క చేయరు. హీరోయిన్ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి వింత వింత సంఘటనలు ఎదురవుతూ అందరినీ భయపడతాయి. ఇక ఎంత మొత్తుకున్నా కూడా హీరోయిన్ తల్లి మాత్రం ఆమె తన కూతురే అని నమ్ముతుంది. అసలు హీరోయిన్ రూపంలో ఇంటికి తిరిగి వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? కుటుంబ సభ్యులంతా అనుకున్నట్టుగా ఆమె తమ అమ్మాయి కాదా? చివరికి ఫ్యామిలీ అంతా ఈ దయ్యం నుంచి ఎలా తప్పించుకున్నారు? అనే విషయాలు తెలియాలంటే ‘ప్రింబాన్’ హర్రర్ సినిమాపై ఒక లుక్కెయ్యండి. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Tags

Related News

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

OTT Movie : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?

OTT Movie : ప్రియుడిని వదిలేసి మరొకడితో… కళ్ళు తెరిచినా మూసినా అవే సీన్లు… క్లైమాక్స్ కెవ్వు కేక

OTT Movie : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Movie : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Movie : యాక్షన్ లేదు, రొమాన్స్ లేదు… IMDbలో 7.4 రేటింగ్‌… హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామా

OTT Movie : మంత్రముగ్ధులను చేసే కథ… మెంటలెక్కించే క్లైమాక్స్.. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్లు

Big Stories

×