BigTV English

Russia Ukraine War Since 9 Months : ఉక్రెయిన్‌పై యుధ్దం మొదలై 9 నెలలు..

Russia Ukraine War Since 9 Months : ఉక్రెయిన్‌పై యుధ్దం మొదలై 9 నెలలు..

Russia Ukraine War Since 9 Months : ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలై నేటితో సరిగ్గా 270 రోజులు పూర్తయ్యాయి. అంటే సుమారు 9 నెలలు నిరాటంకంగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తూనే ఉంది. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంతర్జాతీయ సంస్థ లా ఫ్రాంకోఫోని సభ్యులకు వివరించారు. ఈ 9 నెల్లో రష్యా.. దాదాపు 4వేల 700లకు పైగా క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగించిందన్నారు. ఈ దాడిలో 100ల నగరాలు ధ్వంసంకాగా వేలమంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారని, లక్షల మంది ఉక్రెయిన్‌ నుంచి వలస వెళ్లినట్లు వివరించారు అధ్యక్షుడు జెలెన్‌స్కీ.


ఉక్రెయిన్ యుద్ధం కోరుకోవడం లేదని రాజీ కోసం ప్రయత్నిస్తోందని అన్నారు. ఉక్రెయిన్ తరుపున ఉన్న శాంతి ప్రతిపాదనలను వివరించారు. ఆహార, ఇంధన బద్రత, ఖైదీల విడుదల, రేడియేషన్, అణు రక్షిత, ఐక్యరాజ్యసమితి నియమావళిని అనుసరించి ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని తిరిగి కల్పించడం, మొత్తం యుద్ధాన్ని ముగించి శాంతిని నెలకొల్పేందుకు అన్ని విధాల సహకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. పవర్ గ్రిడ్‌లను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులకు పాల్పడుతోందని..దీనివల్ల శీతకాలంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.


Tags

Related News

Theaters Attack: కెనడాలో ఘోరం.. భారతీయ చిత్రాల థియేటర్లపై దాడులు, పవన్ సినిమాకు

Putin Vs Trump: ట్రంప్‌పై పుతిన్ ఆగ్రహం.. భారత్‌ తలొగ్గదు, అమెరికాకు పెద్ద దెబ్బ

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

Big Stories

×