E-Paper
Advertisement

Waltair Veerayya Title song: గ్యాంగ్ లీడ‌ర్ లుక్‌లో మ‌ళ్లీ మెగాస్టార్‌.. ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ డేట్ ఫిక్స్

Waltair Veerayya Title song: గ్యాంగ్ లీడ‌ర్ లుక్‌లో మ‌ళ్లీ మెగాస్టార్‌.. ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ డేట్ ఫిక్స్

Waltair Veerayya Title song:మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై డైరెక్ట‌ర్ బాబీ తెర‌కెక్కిస్తోన్న క‌మర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘వాల్తేరు వీరయ్య’. మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవిని ఆయన అభిమానులు ఎలా చూడాల‌ని అనుకుంటున్నారో అలా సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రించ‌టానికి బాబీ స‌ర్వం సిద్ధం చేస్తున్నారు బాబీ. మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ రోల్ చేశారు. ఇటు చిరంజీవి, అటు ర‌వితేజ పాత్ర‌ల‌కు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సినిమాను వ‌చ్చే సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేయ‌నున్నారు.

కాగా.. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్ర‌మోష‌న్స్‌తో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే రెండు సాంగ్స్ విడుద‌ల‌య్యాయి. మూడో సాంగ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. ఇది టైటిల్ సాంగ్. ఈ సాంగ్కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇస్తూనే మేక‌ర్స్ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. అందుకు కార‌ణం.. ఆ పోస్ట‌ర్‌లో చిరంజీవి గ్యాంగ్‌లీడ‌ర్ లుక్‌లో క‌నిపించ‌ట‌మే. చిరంజీవి అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కి, ఇటు మాస్ ఆడియెన్స్‌కి ద‌గ్గ‌ర చేసిన చిత్రం గ్యాంగ్ లీడ‌ర్‌. ఆ లుక్‌లో మ‌ళ్లీ చిరంజీవి క‌నిపించ‌నుండ‌టం అనేది ఆయ‌న ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే విష‌య‌మ‌నే చెప్పాలి. ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్‌ను డిసెంబ‌ర్ 26న విడుద‌ల చేయ‌బోతున్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×