
Veera Simha Reddy Song:నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే మాస్. అందులోనూ గోపీచంద్ మలినేని అంటే డబుల్ మాస్. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే ఎవరైనా ఓ మాదిరి మాస్‌ని ఎక్స్ పెక్ట్ చేసి తీరుతారు. అలాంటివారికోసం తెరకెక్కిన పాట మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయే. పక్కా పండగ సాంగ్ అనిపిస్తోందీ సాంగ్. దాబా స్టైల్‌లో ఉన్నా, బాలకృష్ణ రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు.
తోపుడు సోడా బండి మీద వెనక్కి ఒరిగి బాలయ్య వేసిన బ్యాక్ స్టెప్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. పండగ రోజుల్లో పల్లెటూళ్లు, పట్నాలనే తేడా లేకుండా ఈ పాట మారుమోగిపోతుందని అంటున్నారు మేకర్స్.
ట్యూన్ చేసిన తమన్ కూడా మేకింగ్ విజువల్స్ లో అంతే హుషారుగా కనిపిస్తున్నారు. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అనే క్యాచీ సాంగ్‌కి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ రాశారు. ఈ పాటను సాహితి చాగంటి, యామిని, రేణుకుమార్ కలిసి ఆలపించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేశారు. ఆల్రెడీ రిలీజైన టీజర్‌కీ, పాటలకీ చాలా మంచి స్పందన వస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది సినిమా. బాలకృష్ణకి సింహా అనే పేరు కలిసొస్తుంది. ఈ సినిమా టైటిల్‌లో వీరసింహారెడ్డి అనే పేరుంది. సో సంక్రాంతికి సెంటిమెంట్ ప్రకారం హిట్ పక్కా అంటున్నారు నందమూరి అభిమానులు.
శ్రుతిహాసన్ నాయికగా నటిస్తున్న సినిమా ఇది. ఎక్కువ భాగాన్ని రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. లాస్ట్ ఇయర్ క్రాక్ సినిమాతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న గోపీచంద్ మలినేని, ఈ సారి వీరసింహారెడ్డి సినిమాలోనూ మాంచి మాస్ మసాలాలు దట్టించారన్నది ఫిల్మ్ నగర్ టాక్. నందమూరి బాలకృష్ణ కూడా సినిమా హిట్ పక్కా అంటూ సన్నిహితులతో చెబుతున్నారట. అంతా పాజిటివ్ సైన్స్ ఉంటే, అంతకన్నా కావాల్సింది ఏముంది అంటున్నారు మైత్రీ మూవీ మేకర్స్.
Balayya: బాలయ్య బాబు కాదు ‘బాలయ్య తాత’.. జగన్ మీద పంచ్ డైలాగులకేనా కౌంటర్లు?