BigTV English

Akkineni Akhil : అఖిల్ కు కాబోయే మామ దుబాయ్ లో ఏం చేస్తాడో తెలుసా..?

Akkineni Akhil : అఖిల్ కు కాబోయే మామ దుబాయ్ లో ఏం చేస్తాడో తెలుసా..?

Akkineni Akhil : అక్కినేని ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. నాగార్జున ఇద్దరు కొడుకులకు త్వరలోనే పెళ్లిళ్లు కానున్నాయి. మొన్న నాగ చైతన్య, నిన్న అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నాగ చైతన్య హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అఖిల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి తెలుసుకోవాలని ఆశ పడుతున్నారు. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆమె బ్యాగ్రౌండ్ ఏంటా అని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఆమె పేరు జైనాబ్ రావుద్జీ. దుబాయ్ కు చెందిన ఒక మోడల్.. దుబాయ్ లో బాగా ఫెమస్. మరి ఆమె ఏదైనా సినిమాలు చేసిందా? అసలు ఆమె తండ్రి దుబాయ్ లో ఏం చేస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


అఖిల్ కు కాబోయే భార్య జైనాబ్ రావుద్జీ దుబాయ్ కు చెందిన మోడల్.. ఆమె సినిమాల్లో నటించలేదు కానీ అంతకు మించి మోడల్ గా దుబాయ్ లో బాగా పాపులారిటిని సంపాదించుకుందట. సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉందట.. అప్పుడే ఈ సంబంధంను ఫిక్స్ చేశారని టాక్.. ఇక ఆమె తండ్రి జుల్ఫీ రావుద్జీ.. ఈయన దుబాయ్ లో ఒక ప్రముఖ వ్యాపార వేత్త.. ఈయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే నోట మాట రాదు. సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ ఎంతో ప్రముఖమైనదో గల్ఫ్ దేశాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో రావుద్జీ ఫ్యామిలీ రేంజ్ అంతటిది. దుబాయ్ లో బాగా రిచ్ అని చెప్పడం కరెక్ట్..

ఈ జుల్ఫీ రావుద్జీ గల్ఫ్ దేశాల్లో బిగ్ రియల్ ఎస్టేట్ టైకూన్. సగం దుబాయ్ ఆయనదే.. వేల కోట్ల ఆస్తి కలిగిన కుబేరుడు. ఆయనకు రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అంతేకాకుండా ఆయన ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా కూడా పని చేశారు. ఆయన ఏపీ గవర్నమెంట్ లో ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించారు. ఇక ఆయన కుమారుడు జైన్ రావుద్జీ ఒక ప్రైవేట్ సంస్థకు చైర్మన్, ఎండీగా పనిచేస్తున్నారు. గతంలో రావుద్జీ హైదరాబాద్ లోని రోడ్ నెంబర్.7, బంజారాహిల్స్ లో నివాసం ఉండేవారు. ఆయనకు కేబినెట్ మినిస్టర్ స్థాయిలో హోదాను ఏపీ ప్రభుత్వం ఇచ్చిందని తెలుస్తుంది. ఇక్కడ ఉండటానికి ఏపీ గవర్నమెంట్ ఆయనకు కారు, ల్యాప్ టాప్, లక్షలు విలువ చేసే ఫర్నిచర్, మెడికల్ రీయింబర్స్మెంట్, ఒక ప్రైవేట్ సెక్రటరీ, మరో అదనపు ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఒక జమేదార్, ఇద్దరు డ్రైవర్లు, మూడు మొబైల్ ఫోన్లు ఇచ్చారట.. హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఆయన ఆ ఇంట్లో స్టే చేస్తారని సమాచారం.. అఖిల్ కాబోయే మామ ఆస్తులు గురించి తెలుసుకున్న వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. నాగార్జున ఆస్తులు అతని ఆస్తులలో సగం మాత్రమే అనే టాక్ నెట్టింట ప్రచారంలో ఉంది. ఏది ఏమైన అఖిల్ జాక్ పాట్ కొట్టాడు.. ఇక సినిమాలు చెయ్యాల్సిన పని లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే వీరి పెళ్లి డేట్ ను అనౌన్స్ చెయ్యనున్నారని సమాచారం.


ఇక నాగ చైతన్య – శోభిత దూళిపాల పెళ్లి డేట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా వీరిద్దరి పెళ్లి జరగబోతుందని అందరికి తెలుసు.. ఇక అఖిల్ పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే చేస్తారా? లేక దుబాయ్ లోనే పెళ్లి చేసి ఇక్కడ రీసెఫ్షన్ ఏర్పాటు చేస్తారన్నది తెలియాల్సి ఉంది..

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×