Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ 8లో అసలు ప్రేమజంట ఎవరు అని ప్రేక్షకులను అడిగితే ఎవరూ లేరని అంటారు. కానీ విష్ణుప్రియాకు పృథ్విపై ఉన్న ఇంట్రెస్ట్ గురించి మాత్రం కచ్చితంగా మాట్లాడతారు. బిగ్ బాస్ 8లోకి అడుగుపెట్టిన మొదట్లో విష్ణుప్రియా చిన్నపిల్ల ప్రవర్తనతో ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యింది. కానీ అనుకోకుండా తనకు ఏమైందో తెలియదు.. పృథ్విపై ఇష్టం పెంచుకోవడం మొదలుపెట్టింది. ఆ ఇష్టం ఇప్పుడు ఒక రేంజ్‌లో పెరిగిపోయింది. తన తండ్రి వచ్చి పృథ్వితో దూరంగా ఉండమని చెప్పినా అది జరగదని చెప్పేసింది. అలాంటి విష్ణుప్రియా.. పృథ్వితోనే తన ఫ్లాష్‌బ్యాక్ లవ్ స్టోరీని షేర్ చేసుకుంది. మొదటిసారి తన ప్రేమకథ గురించి వివరంగా చెప్పింది.
ఫీల్ అవుతున్నాడేమో
అసలు పృథ్వి అంటే తనకు ఎందుకు అంత ఇష్టమని అడిగినప్పుడు.. తనను చూస్తుంటే తనకు ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ గుర్తొస్తున్నాడని ఓపెన్‌గా చెప్పేసింది విష్ణుప్రియా. తన ప్రవర్తన, తన మాటలు అన్నీ తన మాజీ బాయ్‌ఫ్రెండ్ లాగానే ఉంటాయని చెప్పింది. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో పృథ్వి క్రికెట్ టాస్క్ ఆడుతున్నాడు. అందులో పృథ్వి గెలిచిన ప్రతీసారి విష్ణుప్రియా సంతోషానికి హద్దులు లేవు. పైగా తనను ఛీర్ గర్ల్‌లాగా ఛీర్ చేసింది కూడా. అందరూ పడుకున్న తర్వాత ఇదే విషయాన్ని పృథ్వితో మాట్లాడడం మొదలుపెట్టింది విష్ణుప్రియా. బయట నుండి తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ ఇదంతా చూస్తూ చాలా ఫీల్ అవుతున్నాడేమో అని చెప్తూ తను చాలా ఫీల్ అయ్యింది.
Also Read: యష్మీ అంతమాట అనేసిందేంటి.. నాగార్జున పరువు మొత్తం పాయే..
విషయాలు దాచాడు
అసలు బ్రేకప్ ఎవరు చెప్పారు అని క్లియర్‌గా అడిగాడు పృథ్వి. ఇప్పటివరకు ఎవరూ తనకు బ్రేకప్ చెప్పలేదని, తానే చెప్పానని బయటపెట్టింది. ఎందుకు అని కారణం అడగగా.. దానికి తను స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ‘‘తను నాకు నచ్చని పనిచేశాడు. నాకు మంచి జరిగే పనే చేశాడు. కానీ నాకు చెప్పలేదు. నా దగ్గర చాలా విషయాలు దాచాడు. అవన్నీ బయటికి వచ్చినప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను. అందుకే ఇది వర్కవుట్ అవ్వదు అని చెప్పేశాను. కానీ తనను చూడకుండా నేను ఉండలేను’’ అని చెప్పేసింది విష్ణుప్రియా. అందుకే బ్రేకప్ అయినా కూడా ఇప్పటికీ తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ, కలుస్తూ ఉంటానని తెలిపింది.
అమ్మ ప్రేమ దొరికింది
‘‘మా అమ్మ ఇవ్వలేనంత ప్రేమ కూడా తను నాకు ఇచ్చాడు. ఇప్పటికీ తను నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. తన హగ్ చేసుకుంటే మా అమ్మ హగ్ చేసుకున్నట్టే ఉంటుంది. కానీ నాకెందుకో అది వర్కవుట్ అయినట్టు అనిపించలేదు. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్‌లో ఇలా సంతోషంగా నవ్వుతూ ఉండడం చూసి తను చాలా ఫీల్ అవుతున్నాడని నాకు అనిపిస్తుంది’’ అంటూ తన మనసులోని మాటలన్నీ పృథ్వితో షేర్ చేసుకుంది విష్ణుప్రియా. మొత్తానికి విష్ణుప్రియాలాగా తన పర్సనల్ లైఫ్ గురించి, తన లోపల ఉన్న ఫీలింగ్స్ గురించి ఏ కంటెస్టెంట్ కూడా ఓపెన్‌గా చెప్పలేదు. తన క్వాలిటీనే ఇష్టపడుతున్న ప్రేక్షకులు చాలామందే ఉన్నారు.