BigTV English

OTT Movie : చెల్లెలితో సరసాలు… భర్తకు దిమ్మతిరిగే నిర్ణయం తీసుకునే భార్య

OTT Movie : చెల్లెలితో సరసాలు… భర్తకు దిమ్మతిరిగే నిర్ణయం తీసుకునే భార్య

OTT Movie : ఓటిటిలో ప్రాంతీయ సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. మంచి కంటెంట్ ఉన్న ప్రాంతీయ సినిమాలకు ఓటీటీలో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. భార్య భర్తల మధ్య కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే బెంగాల్ మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో…

ఇప్పుడు మనం చెప్పకోబోయే బెంగాల్ మూవీ పేరు “టూ సిస్టర్స్” (2 sisters)  ఈ మూవీలో భర్త భార్య మధ్యలో మరదలు రావడంతో స్టోరీ డిఫరెంట్ టర్న్ తీసుకుంటుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే…

షర్మిల, ఉరిమి అనే ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు. షర్మిలకి శశాంక్ అనే అనాధను ఇచ్చి పెళ్లి చేస్తాడు తన తండ్రి. అతడు అనాధ అయినాగాని తెలివితేటలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంటాడు. ఉరిమికి కూడా నీరజ్అనే ఒక డాక్టర్ సంబంధం చూస్తాడు. అతడు ఎంబిబిఎస్ చదువుతూ ఉంటాడు. ఉరిమి కూడా అదే విద్య అభ్యసిస్తూ ఉండటంతో తండ్రి ఈ నిర్ణయం తీసుకుంటాడు. తండ్రి అనారోగ్యం కారణంగా మొదట షర్మిలకి వివాహం జరిపిస్తాడు. ఆ తర్వాత ఉరిమిని పెళ్లి చేసుకోవాలని నీరజ్ అనే వ్యక్తితో మాట తీసుకుంటాడు. అలా తండ్రి చనిపోవడంతో కుటుంబం పెద్దగా షర్మిల వ్యవహరిస్తుంది.

ఉన్నత కుటుంబం కావడంతో ఏ లోటు లేకుండా వీళ్ళు హ్యాపీగా ఉంటారు. అయితే నీరజ్ డాక్టర్ చదవాలని లండన్ కి వెళ్ళిపోతాడు. ఉరిమి ఒంటరిగా ఉంటుంది. షర్మిల భర్తకి ఒక కాంట్రాక్టర్ తో పార్ట్నర్ షిప్ ఇప్పిస్తూ బిజినెస్ లో సపోర్ట్ చేస్తుంది. కొద్ది రోజుల తర్వాత షర్మిల అనారోగ్యం బారిన పడుతుంది. అక్కను చూసుకోవడానికి ఉరిమి ఇంటికి వస్తుంది. షర్మిల కూడా ఉరిమి రాకను సంతోషంగా తీసుకుంటుంది. ఈ టైంలో శశాంకతో ఉరిమి క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటుంది.

లండన్ వెళ్లిన నీరజ్, నేను ఇండియా రానని చెప్తూ, ఇక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అని షాక్ ఇస్తాడు. ఆ తరువాత శశాంక్ తో ఉరిమి క్లోజ్ గా ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఉరిమితో శశాంక్ క్లోజ్ గా ఉండటంతో బిజినెస్ సరిగ్గా పట్టించుకోడు. కాంట్రాక్టర్ పార్ట్నర్ షిప్ నుంచి తొలగిస్తానని షర్మిల తో చెప్తాడు. మీ చెల్లెలితో అతడు క్లోజ్ గా ఉంటున్నాడని కూడా హెచ్చరిస్తాడు. ఈ విషయం తెలిసిన షర్మిల భర్తతో మీరు చాటుగా చేస్తున్న వ్యవహారాలన్నీ నాకు తెలుసంటూ శశాంక్ తో చెప్తుంది. మీరిద్దరూ దొంగ చాటుగా కాకుండా, పెళ్లి చేసుకుని సంతోషంగానే ఉండమని చెప్తుంది. చివరికి శశాంక్ మరదలని పెళ్లి చేసుకుంటాడా? అనారోగ్యంతో ఉన్న భార్యని బాధ పెడతాడా? మరదళిని పెళ్లి చేసుకుంటే సమాజం ఏమనుకుంటుందో అని భయపడతాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ మీడియాలో స్ట్రీమింగ్ అవుతున్న “టూ సిస్టర్స్” (2 sisters) మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×