BigTV English

The GOAT: ‘విజిలేస్కో’ సాంగ్ రిలీజ్.. విజయ్ స్టెప్పులు ఏమున్నాయ్ గురు.. చూస్తే వావ్ అనాల్సిందే..

The GOAT: ‘విజిలేస్కో’ సాంగ్ రిలీజ్.. విజయ్ స్టెప్పులు ఏమున్నాయ్ గురు.. చూస్తే వావ్ అనాల్సిందే..

The Greatest Of All Time Movie Song Released: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ గతేడాది ‘లియో’ మూవీతో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. స్టార్ అండ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కింది. అయితే రిలీజ్ అనంతరం తమిళ్‌లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కానీ తెలుగులో మాత్రం పెద్దగా ప్రేక్షకుల్ని అలరించలేక పోయింది. ఇందులో విజయ్‌ ఫ్లాష్‌బ్యాక్‌ను పవర్‌ఫుల్‌గా చూపించడం బాగానే ఉంది. కానీ ప్రజంట్ స్టోరీలోనే చాలా భయస్తుడిలా చూపించడంతో చాలా మంది జీర్ణించుకోలేకపోయారు.


ఎందుకంటే ఒక స్టార్ హీరోని అలాంటి రోల్‌లో ఎవరూ చూడాలనుకోరు. అందువల్లనే ఈ సినిమా కొందరికి కనెక్ట్ కాలేదు. అయినా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్‌లో వచ్చాయి. ఇక ఈ మూవీ సక్సెస్ జోష్‌లో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘THE GOAT’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ పతాకంపై కల్పతి ఎస్ అఘోరం భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Also Read: విజయ్ బర్త్ డే.. కొత్త సినిమా స్పెషల్ వీడియో మామూలుగా లేదుగా..


అంతేకాకుండా ఈ మూవీలో విజయ్‌కు జోడీగా యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో ప్రభుదేవా, స్నేహ, లైలా, జయరాం, కిచ్చా సుదీప్, ప్రశాంత్, యోగిబాబు, వంటి స్టార్ నటీ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. అలాగే ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో విజయ్ డ్యూయల్ రోల్‌లో యాక్షన్‌ మోడ్‌లో కనిపించిన తీరు సినీ ప్రేక్షకాభిమానుల్ని కట్టిపడేసింది.

అందులో ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఓన్లీ యాక్షన్ సీన్‌ను మాత్రమే కట్ చేసి రిలీజ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ మంచి హిట్ అవుతుందని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. ఇక సినీ ప్రియుల్లో మరింత జోష్ పెంచేందుకు మేకర్స్ మరో అప్డేట్‌ను అందించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘విజిలేస్కో’ అంటూ సాగే సాంగ్‌ను మేకర్స్ వదిలారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. యువన్ శంకర్ రాజా, నక్ష అజీజ్ పాడారు. ఈ సాంగ్‌లో విజయ్ డాన్స్ చాలా డిఫిరెంట్‌గా ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×