BigTV English

Jabardast Rohini: పర్సనల్ జోలికి వస్తే తాట తీస్తా..సీనియర్ జర్నలిస్ట్ కు జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చిన రోహిణి

Jabardast Rohini: పర్సనల్ జోలికి వస్తే తాట తీస్తా..సీనియర్ జర్నలిస్ట్ కు జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చిన రోహిణి

jabardast Rohini fire on senior journalist : జబర్దస్త్ రోహిణి అనగానే కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. మొదట్లో కొన్ని సీరియల్స్, అడపాదడపా సినిమాలలో చేసినా జబర్ధస్త్ లో వచ్చిన పేరు ఇండస్ట్రీలో మార్మోగేలా చేసింది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, కామెడీ స్కిట్స్, రియాలిటీ షోలతో ఫుల్ బిజీగా ఉంది ప్రస్తుతం రోహిణి. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ ను వెరైటీగా ప్లాన్ చేసింది రోహిణి. బర్త్ డే బాయ్ అనే మూవీకి సంబంధించిన ప్రమోషన్ అది. సినిమా సెలబ్రిటీలు చేసే ప్రమోషన్స్ ఒక్కోసారి రివర్స్ అవుతుంటాయి. మొన్నామధ్య విశ్వక్ సేన్ పబ్లిక్ గా రోడ్డు పై చేసిన ప్రమోషన్ చాలా విమర్శల పాలయింది. అలాంటి పరిస్థితే జబర్దస్త్ రోహిణికి వచ్చింది. బర్త్ డే బాయ్ మూవీ గురించి రోహిణితో ఆ సినిమా నిర్మాతలు ఓ ఫన్నీ వీడియో చేయించారు.


బర్త్ డే బాయ్ తెచ్చిన తంటా

ఇక అందులో కామెడీ క్రియేట్ చేయడం కోసం రోహిణితో కొన్ని డైలాగులు చెప్పించారు. రోహిణి ఓ రేవ్ పార్టీకి వెళ్లి రావడం అందులో ఆమె పోలీసులకు డ్రగ్స్ తీసుకున్నట్లు దొరికిపోవడం చూపిస్తారు. ఏదో బర్త్ డే ఫంక్షన్ అనుకుని వచ్చాను. నాకేం తెలియదు. నేనసలు డ్రగ్స్ జోలికి వెళ్లలేదు. నన్ను వదిలిపెట్టండి అంటూ రోహిణి పోలీసులను వేడుకుంటుంది. అయితే ఇదంతా చూసిన జనం మొదట్లో నిజమే అనుకుని నమ్మేశారు.


ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి

కొన్ని వార్తా పేపర్లలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన జబర్ధస్త్ రోహిణి అంటూ హెడ్ లైన్స్ లో వార్తలొచ్చాయి. రోహిణికి ఫోన్ కాల్స్ కూడా వెళ్లాయి. నిజమేనా అని అంతా కంగారుపడ్డారు. ఆ తర్వాత సినిమా ప్రమోషన్స్ లో భాగమే అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు ఆమె అభిమానులు. రీసెంట్ గా గత నెలలో బెంగళూరు లో జరిగిన ఓ ఈవెంట్ లో నటి హేమ డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమెను కస్టడీకి కూడా తీసుకున్నారు పోలీసులు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అదే మైండ్ సెట్ లో ఉన్న వీక్షకులను రోహిణి డ్రగ్స్ కేసు నిజమేనన్నట్లుగా చాలా మంది మొదట్లో నమ్మారు. చాలా మంది దీనిని లైట్ గా తీసుకున్నారు. అయితే ఓ సీనియర్ జర్నలిస్ట్ మాత్రం రోహిణిని ఏకి పారేశాడు.

సీనియర్ జర్నలిస్ట్ పై ఫైర్

రోహిణి ఇష్యూ పై స్పందిస్తూ ఆమె డ్రగ్స్ నిజంగానే తీసుకుని ఉండివుంటుంది. నిప్పులేకుండా పొగ రాదు కదా. రోహిణి వ్యవహారంలో అలాగే జరిగి వుంటుంది అని వ్యాఖ్యానించారు. పైగా రోహిణికి అన్ని అవలక్షణాలు ఉన్నాయని మందు కూడా కొడుతుందని ఆ వీడియోలో సీనియర్ జర్నలిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే లావుగా ఉన్న రోహిణిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ రారని అన్నాడు. దీంతో ఫైర్ అయిన రోహిణి “ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మాట్లాడాలి. నోటికి ఏమొస్తే అది మాట్లాడటం మంచిది కాదు. నేను సర్జరీ తర్వాత లావయిన మాట వాస్తవమేనని అయినా అవకాశాలకేమీ కొదవలేదన్నారు. అసలు నా పర్సనల్ విషయాల జోలికి వస్తే చెప్పుతీసుకుని కొడతా. ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ చేస్తే తాట తీస్తా” అంటూ ఫైర్ అయ్యారు. సీనియారిటీ ఉందని ఎంత మాట పడితే అంత మాట్లాడితే ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఇక ఇంతటితో ఈ ఇష్యూని ఆపేయండని. తన పర్సనల్ లైఫ్ జోలికి రావొద్దని వేడుకుంటోంది.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×