E-Paper
Advertisement

Superstar vs Megastar clash : మెగాస్టార్‌తో పెట్టుకుంటున్న సూపర్ స్టార్… క్లాష్‌లో గెలిచేదెవరు?

Superstar vs Megastar clash : మెగాస్టార్‌తో పెట్టుకుంటున్న సూపర్ స్టార్… క్లాష్‌లో గెలిచేదెవరు?
Advertisement

Superstar vs Megastar clash : టాలీవుడ్‌లో ఇద్దరు బడా హీరోలు సేమ్ డేట్ రిలీజ్ చేసుకున్న సందర్భాలున్నాయి. ఒక రోజు గ్యాప్‌లో వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో హీరో ఫ్యాన్స్ మధ్య ఉండే పోటీ, కలెక్షన్లు, రికార్డుల ఊసులు మామూలుగా ఉండదు. కాని, ఈసారి వెరైటీ. టాలీవుడ్ మెగాస్టార్, తమిళ సూపర్ స్టార్ పోటీకి దిగుతున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా వీళ్లిద్దరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరుగుతోంది. మెహర్ రమేష్‌కు ఎవరూ అవకాశం ఇవ్వకపోయినా… చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని ఎలా మెహర్ ఎంత వరకు నిలబెట్టుకుంటాడో చూడాలి. మెహర్ రమేష్ సినిమాలు ఫ్లాప్ అయిన మాట వాస్తవమే గాని… అతని సినిమాలు చాలా రిచ్‌గా ఉంటాయి. స్క్రీన్‌పై పెట్టిన బడ్జెట్, రిచ్ నెస్ కనిపిస్తుంటుంది. కాకపోతే, సినిమా హిట్ అయితేనే దానికి విలువ.

ఈ మధ్యే రౌడీ అల్లుడును గుర్తు చేసేలా టాక్సీ డ్రైవర్‌ పోజ్‌లో ఉన్న చిరంజీవి ఫొటోస్ రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాకు బజ్ మరింత పెరిగింది. ఈ సినిమాను ఆగస్ట్ 11న రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్ట్ 15 సెలవులను క్యాష్ చేసుకునేందుకు చిరు సినిమాను తీసుకొస్తున్నారు.

Advertisement

అదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. భోళా శంకర్ కంటే.. ఒకరోజు ముందు.. ఆగస్ట్ 10వ తేదీన అన్ని భాషల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. సో, ఒకవేళ టాక్ తేడా వస్తే భోళా శంకర్‌కు పెద్ద దెబ్బ తప్పదు. అసలే మెహర్ రమేష్ మూవీ కదా. నమ్మకాలు తక్కువ. రిజల్ట్‌పై ఎవరికీ హోప్స్ లేవు. అలాంటి సమయంలో భోళా ఫట్ అయి జైలర్ హిట్ అయితే.. ఇద్దరు స్టార్ల మధ్య క్లాష్‌లో సూపర్ స్టారే గెలుస్తాడు.

ఇక భోళా శంకర్ రిలీజ్ అవుతున్న రోజే టిల్లు స్క్వేర్ సినిమా కూడా విడుదల అవుతోంది. ఈ సినిమాకు స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. టాక్ ఎలా ఉన్నా సరే.. థియేటర్లకు వెళ్లడం ఖాయం. సో, భోళా శంకర్ రిజల్ట్ కాస్త అటుఇటు అయితే.. ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్‌పై పడుతుంది. 

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×