E-Paper
Advertisement

Adipurush : ‘ఆది పురుష్’ వాయిదా పడనుందా..!

Adipurush : ‘ఆది పురుష్’ వాయిదా పడనుందా..!
Advertisement

Adipurush : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌లో తెలియని అసహనం ఉంది.ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన హీరోగా నటించిన ‘ఆది పురుష్’ సినిమా ఫ్యాన్స్, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకు కారణం ఆది పురుష్ టీజర్. నార్మల్ సినిమాగా కాకుండా, యానిమేషన్ స్టైల్‌లో ఉండటం అనేది ఎవ్వరికీ నచ్చలేదు. సినిమాను రానున్న సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయటానికి నిర్మాతలు నిర్ణయించుకున్నారు. కానీ లేటెస్ట్‌గా వినిపిస్తోన్న సినీ సర్కిల్స్ టాక్ మేరకు.. ఇప్పుడు ఆది పురుష్ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయట. అందుకు కారణం.. టీజర్ తర్వాత సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గిపోవటం ఒకటైతే.. సంక్రాంతి రేసులో చిరంజీవి, బాలకృష్ణ, దళపతి విజయ్ వంటి అగ్ర హీరోల సినిమాలున్నాయి. భారీ పోటీ ఉండటం.. ఆది పురుష్‌పై అంచనాలు ఊహించిన స్థాయిలో లేకపోవటంతో డిస్ట్రిబ్యూటర్స్ ఇతర సినిమాలకే మొగ్గు చూపుతున్నారని సమాచారం. దీంతో ఆది పురుష్‌ చిత్రాన్ని వాయిదా వేయటానికి నిర్మాతలు నిర్ణయించుకున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

నిజానికి ఆది పురుష్ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టులోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో సినిమా రిలీజ్ వాయిదా వేశారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలని అన్నారు. కానీ తీరా ఇప్పుడు మళ్లీ సినిమాను వాయిదా వేయటం అనేది ఫ్యాన్స్‌ని బాధ పడుతుందనటంలో సందేహం లేదు. మరి ఫ్యాన్స్‌ని ప్రభాస్ అండ్ టీమ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×