Big Stories

Kantara Song : ‘కాంతార’ పాట కాపీ వివాదం..

Kantara Song : రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మూవీ రిలీజై చాలా రోజులే అవుతుంది. అయితే తాజాగా ఇప్పుడు సినిమాపై వివాదం నెలకొంది. అసలు వివాదం ఏంటి? ఏంటా వివాదం అనే వివరాల్లోకి వెళితే.. ‘కాంతార’ చిత్రంలో ‘వరాహ రూపం దైవ వరిష్టం..’ అనే పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడా పాటను కాపీ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. కేరళకు చెందినథాయికుడమ్ బ్రిడ్జ్ అనే మ్యూజిక్ ట్రూప్ తమకు చెందిన పాటను కాపీ చేశారంటూ ఆరోపణలు చేసింది. తమ అనుమతి లేకుండా పాటను కాపీ చేశారంటూ సదరు ట్రూప్ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నెటిజన్స్ తమకు మద్దతు ఇవ్వాలని కోరింది.

- Advertisement -

‘‘కాంతార’ మూవీలో ‘వరాహ రూపం’ అనే పాట మేం రూపొందించిన ‘నవరసం’ అనే పాటలాగానే ఉంది. అందుకు మా పర్మిషన్ తీసుకోలేదు. మా థాయికుడమ్‌కు కాంతార సినిమాకు సంబంధం లేదు. ఇలా చేయటం అనేది కాపీ రైట్ చట్టాన్ని ఉల్లఘించటమే అవుతుంది. ఇన్‌స్పైర్ కావటానికి, కాపీ చేయటానికి తేడా ఉంటుంది. కావున మేం లీగల్ పరమైన చర్యలు తీసుకోవటానికి సిద్ధమవుతున్నాం’’ అని తెలియజేసింది. మరి థాయికుడమ్ ట్రూప్ చేసిన ఆరోపణలపై కాంతార చిత్ర యూనిట్ స్పందించలేదు. మరి వారెలా స్పందిస్తారనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోన్న విషయం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News