Google : భారత్ లో గూగుల్‌కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. 1337.76 కోట్ల జరిమానా విధించి నాలుగు రోజులు గడవక ముందే… మరోసారి 936.44 కోట్ల జరిమానా విధించింది… కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా- CCI.మార్కెట్‌లో గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు… ప్లే స్టోర్ పాలసీ నిబంధనల్ని తుంగలో తొక్కుతోందని… పేమెంట్ యాప్స్, అండ్ పేమెంట్ సిస్టంను ప్రమోట్ చేస‍్తుందని CCI ట్వీట్ చేసింది. ఇందుకు గానూ గూగుల్‌కు 936.44 కోట్ల ఫైన్ విధిస్తున్నట్లు ఆ ట్వీట్‌లో పేర్కొంది. మొత్తానికి నాలుగు రోజుల వ్యవధిలో గూగుల్ కు 2,274 కోట్ల రూపాయలకు పైగా జరిమానా విధించింది… CCI.మార్కెట్ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్న గూగుల్… తన పద్ధతి మార్చుకోవాలని CCI సూచించింది.
ఒక యాప్ ను అభివృద్ధి చేసిన డెవలపర్… అది యూజర్లకు చేర్చాలంటే యాప్ స్టోర్ పైనే ఆధార పడాలి. మన దేశంలో ఎక్కువగా వాడుతున్నవి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లే. దీంతో యాప్ డెవలపర్లు తమ యాప్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలంటే… గూగుల్ ప్లే స్టోర్ మీద ఆధార పడటం తప్ప వేరే దారి లేదు. ప్లే స్టోర్‌లో యాప్ లిస్ట్ చేయాలంటే గూగుల్ రూల్స్ కు తలొగ్గడంతో పాటు… గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్‌ను అనుసరించాలి. ఇది గుత్తాధిపత్యాన్ని దుర్వినినయోగం చేయడమేనని భావించిన CCI… గూగుల్ కు భారీగా జరిమానా వడ్డించింది.
తొలిసారి భారీ జరిమానా విధించినప్పుడే స్పందించిన గూగుల్… కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం భారత కస్టమర్లు, వ్యాపారులకు పెద్ద ఎదురు దెబ్బ అని వ్యాఖ్యానించింది. దీని వల్ల వినియోగదారులపై అదనపు భారం పడుతుందని చెప్పుకొచ్చింది.