E-Paper
Advertisement

Krish Jagarlamudi: హరిహర వీరమల్లు.. క్రిష్ తప్పుకున్నాడా.. ? తప్పించారా.. ?

Krish Jagarlamudi: హరిహర వీరమల్లు.. క్రిష్ తప్పుకున్నాడా.. ? తప్పించారా.. ?
Advertisement

Krish Jagarlamudi: టాలీవుడ్ లో ఈ మధ్య సినిమా రిలీజ్ కు డైరెక్టర్స్ మారడం ఫ్యాషన్ గా మారింది. సాధారణంగా సినిమా షూటింగ్ సమయంలో హీరో, హీరోయిన్స్, టెక్నీషియన్స్ మారడం చూస్తూనే ఉంటాం.కానీ , ఇప్పుడు సినిమా మొత్తం పూర్తీ అయ్యిన తరువాత డైరెక్టర్స్ పేర్లు తీసేసి నిర్మాతలే డైరెక్టర్లగా మారినట్లు పేర్లు వేసుకోవడం హాట్ టాపిక్ గా మారుతుంది. మొన్నటికి మొన్న డెవిల్ సినిమా సమయంలో నిర్మాత అభిషేక్ నామా ఇలానే చేశాడు. ఇప్పుడు హరిహర వీరమల్లు నిర్మాత ఏఎమ్ రత్నం కూడా అదే తరహాలో ఉన్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతున్నవిషయం తెల్సిందే. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పవన్ రాజకీయ ప్రచారాల కారణంగా ఆగుతూ ఆగుతూ షూటింగ్ ను పూర్తిచేసుకుంటూ వస్తున్న ఈ సినిమా చివరి దశకు చేరుకొంది. ఈ సినిమా కోసం క్రిష్ ఎంతో కష్టపడినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక ఈ నేపథ్యంలోనే క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అలా అనుకోవడానికి కారణం.. టీజర్ పోస్టర్స్ లో డైరెక్టర్ పేరు మిస్ అవ్వడమే. ఒక పోస్టర్ లో లేకపోయినా.. ఇంకొక పోస్టర్ లో అయినా ఉంటుంది అనుకుంటే..నేడు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ లో కూడా క్రిష్ పేరు లేదు. దీంతో హరిహర వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకున్నాడా.. ? తప్పించారా.. ? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ తప్పుకుంటే.. ఆ విషయం చెప్పకుండా ట్విట్టర్ లో ఎందుకు ట్యాగ్ చేశారు అనేది మరింత గందరగోళానికి దారితీసింది.

ఇంకోపక్క ఈ చివరి దశ షూటింగ్ ను రత్నం కొడుకు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇతను రూల్స్ రంజన్ సినిమాతో ప్లాప్ ను అందుకున్నాడు. మరి ఇందంతా ఏంటి.. ? ఎందుకు మేకర్స్ ఇలా ప్రేక్షకులను కన్ఫ్యూజ్ లో పడేశారు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×