Big Stories

Amit shah Fake Video Case : అమిత్ షా ఫేక్ వీడియో కేసు : కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతకు నోటీసులు

Amit shah Fake Video Case Update : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎడిటెడ్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు దూకుడు పెంచారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీత ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం ఆమెకు CRPC41A నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

ఇటీవల మెదక్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పారు. కానీ కొందరు ఆ వీడియోను మార్చి.. మొత్తం రిజర్వేషన్లనే రద్దు చేస్తామని చెప్పినట్లుగా క్రియేట్ చేశారు. ఏప్రిల్ 25న అమిత్ షా మాట్లాడితే.. ఏప్రిల్ 29 వరకూ ఈ వీడియో బయటికి రాలేదు.

- Advertisement -

Also Read : డీప్ ట్రబుల్.. వైరల్ గా అమిత్ షా ఎడిట్

వీడియో మార్ఫింగ్ చేశారని తెలుసుకున్న బీజేపీ నేతలు సైలెంట్ గా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. వెంటనే 10 మందికి నోటీసులిచ్చారు. వారిలో నలుగురు తెలంగాణకు చెందిన వారే ఉన్నారు. వారందరికీ 91/160 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చారు. తాజాగా తెరపైకి కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీత పేరు రావడంతో.. ఇంకా ఎవరెవరు బయటికొస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News