BigTV English
Advertisement

Pushpa3 : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించే న్యూస్.. పుష్ప 3 వచ్చేది అప్పుడే..?

Pushpa3 : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించే న్యూస్.. పుష్ప 3 వచ్చేది అప్పుడే..?

Pushpa3 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ మూవీ మంచి హిట్ టాక్ అని ఎందుకోవడంతో సీక్వెల్ గా పుష్ప 2 సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. గ తేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టించింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడంతో పాటుగా వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ 1800 కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది. మూవీ వచ్చి రెండు నెలలు అవుతున్నా మూవీ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. థియేటర్లలో పాటు ఓ ఓటీటిలో కూడా ఈ మూవీ సందడి చేస్తుంది. ఇక పుష్ప 3 కూడా ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో పుష్ప 2 కన్నా ఇంకాస్త అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉంటాయని ఫాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పుష్ప3 ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీ గురించి మరో వార్త ఇంటర్నెట్లో షేక్ చేస్తుంది. పుష్ప 3 మూవీ అప్పుడే స్టార్ట్ అవుతుంది అంటూ ఓ వార్త నెట్ ఇంత ప్రచారంలో ఉంది. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..


పుష్ప 2 లోని కొన్ని సీన్లకు లీడ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సీన్లు పుష్ప 3 లో చూడొచ్చు అని ప్రకటించారు. రెండవ భాగంలో మూడవ భాగానికి కొన్ని లీడ్స్ కూడా ఇచ్చేసారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే.. అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడంతో భారీగా జనం అక్కడికి చేరుకున్నారు దాంతో థియేటర్ వద్ద పరిస్థితి ఏర్పడింది. మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు ప్రస్తుతం ప్రాణాలతో ఉన్న ప్రాణాల కోసం పోరాడుతూ ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఈ ఘటన తర్వాత పుష్ప 3 మూవీ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు.

మరి ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అంటే దీనికి సుకుమార్ కూడా సమాధానం చెప్పడం కష్టమేమో. ప్రస్తుతానికి సన్నివేశం అలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీ షూటింగ్ సమ్మర్ లో స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ దాదాపు ఏడాది టైం ని ప్రకటించినట్టు తెలుస్తుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయి సినిమా రిలీజ్ ఇవ్వాలంటే కచ్చితంగా ఏడాదిన్నర అవుతుంది. అంటే మనం ఇక పుష్ప 3ని 2027లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.. అటు సుకుమార్ కూడా రాంచరణ్ తో సినిమా చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేసే గ్యాప్లో సుకుమార్ రామ్ చరణ్ తో సినిమాని చేసే అవకాశాలు ఉన్నాయి.. అంటే ఇక పుష్ప 3 మూవీ ని 2027లో సెట్స్ మీదకు తీసుకెళ్లి 2028 సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు ఓ వార్త అయితే ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో అటు సుకుమార్ గానీ ఇటు అల్లు అర్జున్ కానీ రెస్పాండ్ అయితే కానీ తెలియదు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా చేసే అవకాశం ఉంది. అంటే సుకుమార్ కూడా మరో ఏడాది పాటు ఖాళీగా లేడన్నమాట..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×