Pushpa 2.. దిగ్గజ బడా నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘పుష్ప’. ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna) హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఇది.. 2021లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ లో అల్లు అర్జున్ పై సరికొత్త క్రేజ్ క్రియేట్ చేసింది. ఇక అదే ఊపుతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా దాదాపు మూడేళ్లు నిర్విరామంగా కష్టపడి, 2024 డిసెంబర్ 5న ‘పుష్ప 2’ సినిమా విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన సునామిని ఎవరు కూడా అంత తేలికగా మరిచిపోలేరు. థియేటర్లలోనే కాదు ఇటు ఓటీటీలో కూడా ఈ సినిమా ఒక సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకుంది.
అభిమానుల కోసం చివరి సక్సెస్ మీట్..
అంతర్జాతీయంగా సినిమా లవర్స్ ని అలరించిన అల్లు అర్జున్ ఇటు ఓటీటీలో కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను మెప్పించారు. ఇంతటి సక్సెస్ ని చూసిన తర్వాత కూడా అభిమానులలో ఏదో ఎక్కడో తెలియని అసంతృప్తి నెలకొంది. కారణం మనందరికీ తెలిసిందే. డిసెంబర్ నెల మొత్తం అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతూ అలసిపోయాడు. దీనికి కారణం బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో చనిపోయిన రేవతి, హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ఆమె కొడుకు శ్రీ తేజ్..ఆ సమయంలో మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ని కూడా చేసుకోవడం కరెక్ట్ కాదని ఆగిపోయారు. దేశం మొత్తం టాలీవుడ్ వైపు మరోసారి గర్వపడే రేంజ్ లో హిట్ కొట్టినప్పటికీ, తమ అభిమాన హీరో సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోయాడని అటు అభిమానులలో తీవ్రమైన అసంతృప్తి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలోనే అభిమానుల సంతోషం కోసం అల్లు అర్జున్ అలాగే చిత్ర బృందం హైదరాబాదులో ఈరోజు చివరి సక్సెస్ మీట్ ను నిర్వహించబోతున్నారట. ముఖ్యంగా ఈ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడే మాటల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ తన కొత్త సినిమా కోసం చాలావరకు మేకోవర్ అయ్యారు. ఆయన గెటప్ కూడా ఈరోజు వైరల్ కానుంది.
సక్సెస్ మీట్ లో హైలెట్ కానున్న బన్నీ స్పీచ్.
ఇకపోతే పబ్లిక్ ఈవెంట్స్ లో అల్లు అర్జున్ మాట్లాడిన ప్రతిసారి కూడా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. అందుకే ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా పొరపాట్లు జరగకుండా స్పీచ్ ఇవ్వబోతున్నారని సమాచారం. ఇక సంధ్యా థియేటర్ ఘటన గురించి మాట్లాడకుండా.. కేవలం తన సినిమా కెరియర్ గురించి, ఎలాంటి ప్లాన్ చేసుకోబోతున్నారు అనే విషయాల గురించి మాత్రమే మాట్లాడాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రభుత్వాల జోలికి వెళ్లకుండా కేవలం సినిమాలు, అభిమానులు వరకే తన స్పీచ్ ముగించాలని కూడా అనుకుంటున్నారట . మరి ఈరోజు జరగబోయే సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఏం మాట్లాడతారు? ఎలాంటి విషయాలు గురించి చర్చించబోతున్నారు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.