BigTV English

Vijay Devarakonda: రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ మూవీస్ జోష్‌కి బ్రేక్ పడనుందా..!

Vijay Devarakonda: రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ మూవీస్ జోష్‌కి బ్రేక్ పడనుందా..!

Will Rowdy Star Vijay Devarakonda Movie Josh Get A Break: టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియాపై మనసు పారేసుకున్నారు. అంతేకాదు పాన్ ఇండియా జపం చేస్తూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీ బిజీ అయిపోతున్నారు. ఒక్క తెలుగు మూవీస్‌కే పరిమితం కాకుండా అన్ని లాంగ్వేజ్‌లలో తమకి సంబంధించిన సినిమాలను చేస్తున్నారు. అందరూ తమ తమ మూవీస్ చేస్తూ మంచి జోష్‌లో ఉంటే ఓ యంగ్ హీరో మాత్రం బ్యాక్ పడిపోతున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో తన సత్తా చాటే దమ్మున్నా సరే ఆ రేంజ్‌లో తన సత్తాని చాటుకోలేకపోతున్నాడు.


టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే టాలీవుడ్‌లో వచ్చిన అర్జున్‌రెడ్డి మూవీతో రాత్రికి రాత్రికి స్టార్ హీరోగా మారిపోయాడు. అంతేకాదు ఈ మూవీతో టాలీవుడ్ అగ్రహీరోల సరసన నిలిచిపోయాడు. ఇక అరడజన్ మూవీస్ చేసినా సరే.. ఒక్కటంటే ఒక్క మూవీ కూడా హిట్ కాలేదు. అందులో గీతాగోవిందం మూవీ మాత్రమే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసి రౌడీ స్టార్‌ని మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేలా చేసింది. అంతేకాదు లైగర్‌, ఖుషీ, ఫ్యామిలీ స్టార్ వంటి మూవీస్ కూడా డిజాస్టర్ అయి అనుకున్నంత మార్క్‌ని సంపాదించలేకపోయాయి. అందులోనూ తన వద్ద సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో సందిగ్దంలో పడ్డారట విజయ్ దేవరకొండ.

Also Read: మురారి మూవీకి మహేశ్ బాబునే ఎందుకు సెలక్ట్ చేశారంటే.!


ఒకప్పుడు విజయ్ దేవరకొండ మూవీ వచ్చిందంటే చాలు టాలీవుడ్ మూవీ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేసేవారు. అలాంటిది ప్రస్తుతం తన చేతిలో ఒక్క మూవీ కూడా హిట్ కాలేకపోయాయి. అందులోనూ మిగతా హీరోలు నానీ, రామ్, నాగచైతన్య వంటి హీరోలు సైతం తాము చేసే సినిమాలకు మార్కెట్‌ని పెంచుకుంటుంటే.. మన రౌడీ హీరో మాత్రం బౌన్స్ బ్యాక్ అవడానికి ఏళ్లకేల్లు టైమ్ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు ఈ హీరోకి గత ఏడాది నుండి టైమ్ అస్సలు కలిసిరావడం లేదు. అందుకే తన సినీ కెరీర్‌ని రీసెట్‌ చేసుకునేందుకు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. గౌతమ్ డైరెక్షన్‌లో వీడీ 12 స్టార్ట్ చేసిన తాను, రవికిరణ్‌ కోలాతో యాక్షన్ సినిమా, రాహుల్ సాంకృత్యంతో పిరియాడిక్‌ మూవీ చేసేందుకు రెడీ అయిపోయాడు. అయితే ఇందులో ఒకటి కౌబ్యాక్ డ్రాప్ కావడం, మరో ప్రాజెక్ట్ రాయలసీమ మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్నాయి. అయితే ఈ మూవీస్ అనుకున్నట్టుగా హిట్‌ని సంపాదించుకుంటే మనోడి కెరీర్ మళ్లీ ట్రాక్ ఎక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఎనీవే టాలీవుడ్‌ ఆడియెన్స్‌ని ఇలానే ఎంటర్‌టైన్ చేస్తూ అందరిని అలరించలాని కోరుతూ మళ్లీ తన మూవీస్ సక్సెస్ ట్రాక్‌లో దూసుకుపోవాలని కోరుకుందాం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×